Search
Sunday 18 November 2018
  • :
  • :

ఖరీఫ్ కు సిద్ధం

Prepare to kharif 

రెండు లక్షల 30వేల ఎకరాల్లో సాగు అంచనా
అవసరం కానున్న ఎరువులు నాలుగు లక్షల
40వేల క్వింటాళ్లు
11వేల 8వందల 60క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం

మనతెలంగాణ/పెద్దపల్లి: ఈ నెల 25న వచ్చే రోహిణి కా ర్తెతో  ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్‌కు గాను పెద్దపల్లి జి ల్లా ఖరీఫ్ ప్రణాళికను వ్యవసాయ శాఖాధికారులు సిద్ధం  చేశారు. ఈ సీజన్‌లో 2లక్షల 30వేల ఎకరాల్లో వివిధ ర కాల పంటలు సాగు కానున్నాయి. ఈ పంటలకు అవసర మయ్యే ఎరువులపై అధికారులు నివేదికను సిద్ధం చేశారు. సబ్సిడీపై ఇచ్చే ఆరుతడి పంటల విత్తనాలను అందుబాటు లో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.గత ఎడాది వ ర్షాలు ఆశించిన మేర కురవక పోవడంతో అంచనాల మే రకు పంటలు సాగు కాలేదు.ముఖ్యంగా శ్రీరాంసాగర్ ప్రా జెక్టు  నీటిని వారబంది పద్దతిన విడదల చేసినప్పటికి ఆయకట్టు చివరి వరకు అందక పోవడంతో సాగు విస్తీర్ణం తగ్గిం ది.గడిచిన ఎడాదికి భిన్నంగా ఈ సీజన్‌లో వర్షాలు ముం దస్తుగానే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అ ంచనా వేయడంతో ఆశించిన స్థాయిలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ బావిస్తోంది.ఇప్పటి వరకు జిల్లా లో 15వేల మట్టి నమూనాలను సేకరించిన వ్యవసాయశాఖ వాటి ఫలితాలను కార్డుల రూపేణా రైతులకు అందించి అందుకు తగ్గట్టుగానే పంటలు వేయడం,ఎరువులు వా డడంపై రైతలకు అవగాహన కల్పిస్తోంది. వ్యవసాయశాఖ రూపొందించిన ఖరీఫ్ ప్రణాళికను అనుసరించి లక్షా 35 వేల ఎకరాల్లో వరి,80 వేల ఎకరాల్లో పత్తి,20 వేల ఎకరాల్లో మొక్కజొన్న,2వేల ఎకరాల్లో కంది, 15 వ ందల ఎకరాల్లో పెసర,వెయ్యి ఎకరాల్లో కూరగాయలు మిగిలిన విస్తీర్ణంలో సోయా, మినుము,నువ్వు తదితర ఆరుతడి పంటలు సాగు కానున్నాయి.జిల్లాలో గడిచిన ఎడాదిలో సాగయిన ప్రాధన పంటలైన వరి,పత్తి సాగు లో మార్పులు చోటు చేసుకోనున్నాయని వ్యవసాయశాఖ భావిస్తోంది. గత సీజన్‌లో లక్ష ఎకరాల్లో వరి,మరో లక్ష ఎకరాల్లో పత్తి సాగు కాగా,ఈ సారి వరి పంట 35వేల ఎకరాల వి స్తీర్ణం పెరగ నుండగా,పత్తి పంట మాత్రం 20 వేల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గనుంది.
ఎరువులు,విత్తనాలపై కసరత్తు
ఖరీఫ్ సాగు అంనాలకు అనుగునంగా ఎరువులు,విత్తనాలను అందుబాటులో ఉంచేందు కు వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ సీజన్‌లో 22వేల టన్నుల యూరియా, 16 వేల 8 వందల టన్నుల డిఎపి కాంప్లెక్స్ 5వేల 5 వందల టన్నుల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎ రువులు అవసరం కానున్నాయి.
ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.అలాగే పెద్దపల్లి జిల్లా కు ప్రభుత్వం 11వేల 8 వందల 60 క్వింటాళ్ల సబ్సిడీ వ్తినాలను కెటాయించిం ది.6,700 క్వి ంటాళ్ల వరి,250 క్వింటాళ్ల మొక్కజొన్న, 325 క్వింటాళ్ల కంది,350 క్వింటాళ్లపె సర,80 క్వింటాళ్ల మిను ము,4,155 పచ్చిరొట్ట ఎరువులను కెటాయించారు.ఎరువులు,సబ్సిడీవిత్తనాలు అవసరమున్న రైతులు సంబందిత మ ండల వ్యవసాయ శాఖాదికారుల నుండి పర్మి ట్లు పొందాల్సి ఉంది. వీటిని జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలు,డిసి ఎంఎస్ ద్వారా పంపిణీ చేయనున్నారు.

Comments

comments