Home నిర్మల్ పరీక్షలకు సర్వం సిద్ధం

పరీక్షలకు సర్వం సిద్ధం

exam* నేటి నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు
* నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 23 సెంటర్లు
* 15,124 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు
* నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
* పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
* ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
* ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోనున్న పోలీసులు

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభమై మార్చి 16వరకు జరగనున్నాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం 7963 మంది, ద్వితీయ సంవత్సరం 7161 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీటి నిర్వహణకు సంబంధించి ఇప్పటికే జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో నేటి నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. ఎంసెట్.,గ్రూప్-2 పరీక్షల మాదిరిగానే నిమిషం ఆలస్యమైన పరీక్ష నిరాకరించాలన్నారు.ప్రభుత్వ కేంద్రాలల్లో సీసీ కెమెరాల నిఘా నీడలో పరీక్షలను నిర్వహించనున్నారు,మాల్ ప్రాక్టిస్ లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించినట్లు ఇంటర్‌బోర్డు పరీక్షల నిర్వహణ జిల్లా నోడల్ అధికారి అలెగ్జాండర్ పేర్కొన్నారు. నిర్మాల్ జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాల్లో 3 కేంద్రాలు సముస్కత్మక కేంద్రాలుగా(ముథోల్,భైంసా,ఖానాపూర్)లను గుర్తించారు. పరీక్షలకు జిల్లాలో 15.124 మంది విద్యార్థులుః నేటి నుండి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు జిల్లా నుంచి 15.124 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.ఇందులో 7963 మంది ప్రథమ సంవత్సరం,7161 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 23 రీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఈ నెల 28న ప్రారంభమై మార్చి 19న ముగియనున్నాయి.ఉదయం 9గం॥ నుంచి మధ్యాహ్నం 12గం॥ వరకు పరీక్ష నిర్వహిస్తారు.8ః30 నిమిషాలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని,పరీక్ష సమయంలో సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ప్రతీ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు త్రాగునీరు,లైటింగ్,ఫర్నిచర్ ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు పరీక్ష పత్రాలు చేరినట్లు అధికారులు తెలిపారు.
’నిమిషం’ నిబంధన ’… విద్యార్థులకు పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యమైన లోనికి అనుమతించరు.విద్యార్థులందరూ పరీక్ష కేంద్రాలకు ఉదయం 8ః30 గం॥లోగా చేరుకోవాలని అధికారలు సూచించారు.అలాగే నలుగురు స్వాడ్స్ పర్యవేక్షిస్తారన్నారు.అలాగే ఆయా మండలాల్లో పరీక్ష కేంద్రాలను తహసీల్థార్లు తనిఖీ చేయాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు.అలాగే ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించడానికి అధికారులు చొరువ చూపాలని కలెక్టర్ సూచించారు.పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షను అమలు చేయాలన్నారు.పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు.