Search
Sunday 23 September 2018
  • :
  • :

అవిశ్వాసంపై చర్చకు సిద్ధం

SUMITRA

ఢిల్లీ : టిడిపి, వైసిపిలు కేంద్రంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. సభ సజావుగా సాగినప్పుడే అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాను అనుకూలంగా ఉన్నట్టు ఆమె వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టిడిపి ఎంపిలు సోమవారం కూడా లోక్‌సభలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు తమకు అందాయని ఆమె తెలిపారు. సభ ఆర్డర్‌లో ఉన్నప్పుడే వాటిపై చర్చకు సిద్ధమని ఆమె తెలిపారు.  కేంద్రంపై తెదేపా, వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తిరస్కరించారు.  సభ సజావుగా సాగనందువల్లే నోటీసులు తిరస్కరిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కానీ టిడిపి ఎంపిలు మాత్రం తమ ఆందోళనను ఆపలేదు. దీంతో లోక్‌సభను మంగళవారం నాటికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

Preparing for Discussion on Infidelity

Comments

comments