Home జాతీయ వార్తలు రాజ్యసభకు నలుగురు కొత్త సభ్యుల నామినేట్

రాజ్యసభకు నలుగురు కొత్త సభ్యుల నామినేట్

President Appointed the four Rajya Sabha Members

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేశారు. రైతు నేత రామ్ షాకాల్, రచయిత రాకేశ్ సిన్హా, శిల్పి రఘునాథ్ మహాపాత్ర, క్లాసికల్ డ్యాన్సర్ సోనాల్ మాన్‌సింగ్‌లను రాజ్యసభ సభ్యులుగా నియమిస్తూ రాష్ట్రపతి కోవింద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతు రామ్ షాకల్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కాగా, రచయిత రాకేశ్ సంఘ్‌పరివార్‌కు చెందిన వ్యక్తి. ఈయన ఢిల్లీ వర్సిటీలో ప్రొఫెర్‌గా పని చేస్తున్నారు. సోనాల్ మాన్‌సింఘ్ ప్రసిద్ధి డ్యాన్సర్‌గా గుర్తింపు పొందారు. శిల్పి రాఘనాథ్ మహాపాత్ర పూరీ జగన్నాథుడి ఆలయంలో పని చేస్తున్నారు.

President Appointed the four Rajya Sabha Members