Home జాతీయ వార్తలు బహుళత్వమే భారతీయం

బహుళత్వమే భారతీయం

Pranabన్యూఢిల్లీ : వైవిధ్యం, సహనం, బహుళత్వం అనే గొప్ప భారతీయ విలువలకు కట్టుబడి ఉండాలని, ఈ మార్గం నుంచి, భారతీయ మూల విలువల నుంచి  వైదొలగరాదని రాష్ట్రపతి పిలుపు నిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో బీఫ్ అంశంపై  ఓ వ్యక్తిని కొట్టి చంపిన దారుణ నేపథ్యంలో రాష్ట్రపతి బుధవారం తీవ్రంగా స్పందించారు. బహుళత్వం, వైవిధ్యంతో కూడుకున్న భారతీయ సమాజంలో ఐక్యతా దృక్పథం ప్రధాన అనుసంధాన ప్రక్రియగా నిలిచిందని తెలిపారు. భారతీయ నాగరికతకు విలువను తెచ్చి పెట్టిన మౌలిక లక్షణాల కు భంగం కల్గించే రీతిలో  ఎవరూ వ్యవహరించరాదని కోరారు. పక్కదారి పట్టేందుకు అనుమతించరాదని, తరాలుగా మన విధానాలు సహనం, ఓపిక, భిన్నత్వంలో ఏకత్వపు ప్రాతిపదికలను ప్రబోధిస్తూ, ప్రోత్సహిస్తున్నాయని, ఈ జీవలక్షణం కీలకమైనదని రాష్ట్రపతి తెలిపారు. శతాబ్దాలుగా మనకున్న అంతర్గత అనుసంధాన నాగరికతా సంవిధానాన్ని పరిరక్షించుకోవాలని పిలుపు నిచ్చారు. పలు ప్రాచీన నాగరికతలు పతనం చెందాయని, అయితే తరాలుగా భారతీయ నాగరికత ఉనికిని కాపాడుకుంటూ వచ్చిందని, వరుస దాడులను తట్టుకుని నిలిచిందని పేర్కొన్నారు. భారతీయతకు ఉన్న ప్రాణా ధారంగా నిలిచిన సంస్కృతిని విషద్వేషాలతో దెబ్బతీసుకోరాదని హితవు పలికారు.  రాష్ట్రపతిభవన్‌లో బుధవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో రాష్ట్రపతి దాద్రీ అంశం గురించి పరోక్షంగా  పస్తావించారు. భారతీయ మూల విలువలే అందరికీ ప్రాతిపదిక కావాలని , ఏ శక్తి కూడా మన ఘనమైన ప్రజాస్వామిక ప్రక్రియ పురోగతిని నివారించలే దని తెలిపారు. రాష్ట్రపతిపై రూపొందించిన కాఫీ-టేబుల్ బుక్‌ను రాష్ట్రపతికి బహు కరించిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎడిటోరియల్ డైరెక్టర్ ప్రభు చావ్లా రాసిన బుక్‌ను ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆవిష్కరించి, రాష్ట్రపతికి అంద చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముక్తార్ అబ్బా స్ నక్వీ, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, జమ్మూకశ్మీర్ మాజీ సిఎం ఫరూక్ అబ్దుల్లా, ఎంపిలు హాజరు అయ్యారు. దేశం పలు రంగాలలో గణనీయ ప్రగతి సాధించిందని, మరింతగా ముందుకు సాగవ చ్చునని, దీనికి పరిమితి లేదని రాష్ట్రపతి చెప్పారు. ప్రగతిపథానికి అడ్డుకట్టలు ఉండవు, మరింతగా పురోగమనం తప్పనిసరి అని కోరారు. సుదీర్ఘ కాలం రాజ కీయాలలో ఉన్న తనకు తన గురించి రాసిన ఓ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడ టం కొంత ఇబ్బందిగానే ఉందని తెలిపారు. రాష్ట్రపతి పదవి లోకి వచ్చాక చేసే ందుకు ఏదీ ఉండదనే అభిప్రాయం ఉందని, ఇది పూర్తిగా రాజ్యాంగబదమైన విశేష విద్యుక్త ధర్మం అని తెలిపారు. రాష్ట్రపతి అయ్యాక ఇక చేసేందుకు ఏదీ ఉండదని తన స్నేహితుడు సరదాగా చెప్పారని, అయితే తనకు అయితే అ లా అన్పించడం లేదని రాష్ట్రపతి చెప్పారు. రాష్ట్రపతిగా బాధ్య తలు తీసుకున్న తరు వాత తాను సేవలందిస్తూనే ఉన్నానని, దేశాన్ని బలోపేతం చేసేందుకు యత్నిస్తు న్నానని, రాజ్యాంగబద్ధమైన పరిధిలో రాష్ట్రపతి బాధ్యతల నిర్వహణ అపరిమి తంగా ఉంటుందని తెలిపారు. దేశ ప్రజాస్వామిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, ఇది బహుళ ప్రశంసనీయం అని ,దేశంలో సంకీర్ణ ప్రభు త్వాల శకం దాటిపో యిందని ఇప్పుడు ఏక పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటర్లు నిర్ణయాత్మక తీర్పు నిచ్చారని తెలిపారు. చాలా మంది దేశంలో ఇక ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థా యి ఆధిక్యత దక్కదని, సంకీర్ణ దశ కొనసాగుతూ ఉంటుందని అనుకున్నారని రాష్ట్రపతి చెప్పారు. భారతీయ ప్రజాస్వామిక ప్రక్రియకు సొంతదైన ఘనత ఉం దని, ఇందుకు మనం గర్వపడాలని తెలిపారు. దేశంలో పలు కీలక పరిణామా లు చోటుచేసుకున్నాయని, తను తొలిసారిగా ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన దశలో దేశంలో 35కోట్ల మంది ఓటర్లు ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతుందనే అనుమా నాలు ఉండేవని, ఇంత పెద్ద సుదీర్ఘ ప్రక్రియపై విస్తుపొయ్యేవారని కానీ ఇప్పుడు ఇది సజావుగా సాగుతోన్న విశేష ప్రక్రియ అని చెప్పారు. పార్లమెంట్‌కు తాను రాజ్యసభ సభ్యుడిగా తొలిసారిగా వెళ్లానని, అది సంక్షోభిత దశనే అని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ బ్యాంకుల జాతీయకరణకు వెళ్లడం, తరువాత పార్టీ నిలువునా చీలడం వంటి పరిణామాలు జరిగాయని గుర్తు చేసుకున్నారు.
కష్టపడి పనిచేయాలని తల్లి చెప్పింది
చిన్ననాట తాను ఎందరిలాగానో పలు కష్టాలు అనుభవించానని, తల్లి చెప్పడం తో తాను పది కిలోమీటర్ల దూరంలోని బడికి ప్రతిరోజూ నడిచి వెళ్లే వాడినని రాష్ట్రపతి చెప్పారు. దూర భారం ఎంత ఉన్నా తట్టుకుని నిలబడాలని, ముందు కు సాగాలని ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ తనను ప్రభావితం చేస్తూనే ఉన్నా యని వెల్లడించారు. తనపై రూపొందించిన పుస్తకం విషయంలో సీనియర్ జర్నలిస్టు ప్రభుచావ్లా కృషి అభినందనీయమని రాష్ట్రపతి చెప్పారు. ఆయన, ఆయన బృందం రూపొందించిన పుస్తకం తనకు స్నేహితులు, ఆప్తులు, అభిమా నులు అందించిన కానుకగా భావిస్తున్నానని తెలిపారు. ఓ విశిష్ట వ్యక్తిత్వానికి ఈ పుస్తకం ఓ చిరు కానుకని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. పలు అంశాలపై సము చిత అవగాహన, అనుభవం ఉన్న వ్యక్తిగా రాష్ట్రపతి నిలుస్తారని తెలిపారు. సుదీర్ఘ అనుభవాలు, విశిష్ట వ్యక్తిత్వాల ముఖర్జీ జీవితాన్ని ఓ పుస్తక రూపంలోకి తీసుకురావడం క్లిష్టమైన ప్రక్రియనే అవుతుందన్నారు. అధికారం కోసమే రాజకీ యాలకు అతుక్కుపోని వ్యక్తిగా ప్రణబ్ ప్రత్యేకతను సంతరించుకున్నారని, పలు అంశాలలో పార్లమెంట్‌లో వెలుపల కూడా ఏకాభిప్రాయసాధనకు విశేషంగా