Home అంతర్జాతీయ వార్తలు కొలంబో ఘటనపై రాష్ట్రపతి దిగ్ర్భాంతి

కొలంబో ఘటనపై రాష్ట్రపతి దిగ్ర్భాంతి

President Ramnathఢిల్లీ: శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సంభవించిన బాంబు పేలుళ్లపై భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రమూకలు అమాయకులను టార్గెట్ చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.  ఇటువంటి నరమేథాలకు పాల్పడే వారికి నాగరిక సమాజంలో బతికే హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంతటి విపత్తును ఎదుర్కొన్న శ్రీలంక ప్రజలకు భారత్ అన్ని విధాల అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాంబు పేలుళ్ల మృతులకు ఆయన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు  సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ పేలుళ్ల ఘటనను తీవ్రంగా ఖండించారు. మృతులకు నివాళులు అర్పించారు. ఆ దేశ ప్రజలకు భారత్ అన్నివిధాల అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు.

President Ramnath condemnation Colombo Blasts