Home జాతీయ వార్తలు ఆత్మహత్యకు అనుమతి కోరుతూ రాష్ట్రపతికి లేఖ

ఆత్మహత్యకు అనుమతి కోరుతూ రాష్ట్రపతికి లేఖ

PRANABనోయిడా: తాను ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించండంటూ ఓ వ్యక్తి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉద్యోగులు తనని వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. నోయిడా ప్రాంతానికి చెందిన 54 ఏళ్ల డికె గార్గ్ ఓ సంస్థ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి కోరగా అధికారులు లంచం అడుగుతూ తనని బాధపెడుతున్నారని తెలిపారు. ఎన్‌ఒసి ఇవ్వడానికి ఏళ్ల తరబడి తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గార్గ్ సరైన పత్రాలు సమర్పించనందుకే ఎన్‌ఒసి ఇవ్వడం ఆలస్యమైందని జిఎన్‌ఐడిఎ సిఇఒ దీపక్ అగర్వాల్ తెలిపారు. ఎన్‌ఒసిపై విచారణ జరుగుతోందన్నారు.