Home అంతర్జాతీయ వార్తలు ఫలించని ట్రంప్ – కిమ్ భేటీ

ఫలించని ట్రంప్ – కిమ్ భేటీ

Trump

ఒప్పందం లేకుండా అర్ధంతరంగా ముగింపు
కిమ్ డిమాండ్‌పై తొందరపడం : అమెరికా
వెలువడని సంయుక్త ప్రకటన
హనోయ్: అమెరికా, ఉత్తర కొరియా అధినేతల అణు శిఖరాగ్ర సమావేశం ఎలాంటి ఒప్పందం కుదరకుండానే హనోయ్‌లో గురువారం అర్ధంతరంగా ముగిసింది. ఆంక్షల్ని తొలగించమన్న కిమ్ జోంగ్ ఉన్ డిమాండ్‌ను ప్రస్తావిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. సింగపూర్‌లో ఇరువురి మొదటి చారిత్రక శిఖరాగ్ర సమావేశం తర్వాత ఇప్పటి రెండో సమావేశంలో మంచి ఫలితం వస్తుందని అంతా ఎంతో ఎదురు చూశారు. కానీ మొదట అనుకున్నట్టు… ఎలాంటి సంయుక్త ప్రకటన మీద వారు సంతకం చేయలేదు. ప్రతిష్టంభనతో చర్చలు ముగిశాయి. ‘ఒక్కోసారి మనం మెల్లగా నడవాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఇదొకటి. మౌలికంగా వారు సంపూర్ణంగా ఆంక్షలు తొలగించమని కోరారు.
కానీ మేము అ లా చేయలేము’ అని కాస్త నిరాశాపూరిత స్వరం తో తెలిపారు. ‘అయితే అప్పటికంటే కొంత ముం దుకు వెళ్లామనే అనుకుంటున్నాను. ఇప్పటికంటే ముందు ముందు మరింత చేయగలం’ అన్నారు. అణు లేదా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు తి రిగి చేపట్టబోమని కిమ్ వాగ్దానం చేశారు. గ తంలో విజయానికి అదే కొలమానం అని భా వించారు’ అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. మూడో శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరుగుతుందో నిర్ణయించలేదని ట్రంప్ తెలిపారు.

President Trump meets with Kim Jong Un