Home జాతీయ వార్తలు ముందస్తుకు ముస్తాబు?

ముందస్తుకు ముస్తాబు?

indiaనవంబర్, డిసెంబర్‌లోనే సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం

 *ముఖ్యమంత్రి కెసిఆర్ మదిలో ముందస్తు ముచ్చట లేకపోయినా ప్రధాని మోడీ నిర్ణయాన్ని బట్టి అందుకు అన్ని విధాలా సిద్ధం కావాలని నిర్ణయించినట్లు సంకేతాలు *వరాల బడ్జెట్లపై కసరత్తు  *అసెంబ్లీ సీట్ల పెంపుపై అడుగంటుతున్న ఆశలు  *టిఆర్‌ఎస్‌లో అసమ్మతిని అంతమొందించేందుకు మంత్రివర్గ మార్పుల యోచన  *ఈసారి మహిళకు చోటు  *గుజరాత్‌లో ఓట్ల చీలిక వ్యూహంపై స్వల్ప మెజారిటీతో 30 స్థానాల్లో బిజెపి గెలుపును విశ్లేషించిన కెసిఆర్  *ఏకకాల ముందస్తుకు ఓకే అన్న తెలుగు రాష్ట్రాలు?

న్యూఢిల్లీ నుంచి ‘మన తెలంగాణ’ ప్రత్యేక ప్రతినిధి
ముందస్తు ఎన్నికలు రావచ్చంటూ రాష్ట్రానికి కేం ద్రం నుంచి సంకేతాలు అందాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహక చర్యలను ప్రారంభించింది. విషయాన్ని రాష్ట్రంలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. కొత్త సంవత్సరం ప్రారంభంతోనే ఎన్నికల హడావిడి ఇక మొదలు కానుంది. 2019 ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది (2018) నవంబరు, డిసెంబరు మాసాల్లోనే జరగవచ్చనే సంకేతాలకు అనుగుణంగా మరో మూడు నెలల్లో సమర్పించబోయే రాష్ట్ర, కేంద్ర బడ్జెట్‌లు ఎన్నికల బడ్జెట్‌లుగానే ఉండబోతున్నాయి. వివిధ వర్గాల ప్రజలను ఆకర్షించే తీరులో ఈ బడ్జెట్‌లలో వరాలు కురిపించే అవకాశం ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎమ్మెల్యేలకు కూడా వారివారి నియోజకవర్గాల్లో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ప్రజల మధ్యనే ఉండాల్సిందిగా తగిన సంకేతాలిచ్చారు. ఇప్పటికే వివిధ సర్వేల ద్వారా సేకరించిన సమాచారానికి అనుగుణంగా ఏయే నియోజకవర్గాల్లో ప్రభుత్వంపైన ఎలాంటి వ్యతిరేకత ఉందో, ఎక్కడెక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేల విజయావకాశాలపై అనుమానాలు ఉన్నాయో దానికి అనుగుణంగా అధికార పార్టీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఇప్పటివరకు ప్రకటించిన పథకాల ఫలాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందడంలేదని వచ్చిన ఫిర్యాదులపై స్పందించి వాటిని వేగవంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రే టర్ హైదరాబాద్ ఎన్నికల్లో లక్ష ఇళ్ళను కట్టిస్తామని ఇచ్చిన హామీతో విజయావకాశాలను సొంతం చేసుకున్న అధికార పార్టీ మిగిలిన జిల్లాల్లో మరో లక్ష ఇళ్ళను కట్టి చూపించాలని తాపత్రయ పడుతోంది. అక్టోబరుకల్లా రెండు లక్షల ఇళ్ళను లబ్ధిదారులకు అందించాలని భావిస్తోంది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందించకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ప్రకటించిన నేపథ్యంలో ఆరు నూరైనా ఆ పథకం ఫలాలు ప్రజలకు అందించాలని ప్రభుత్వం భావిస్తోం ది.

అందుకే అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై  కేంద్రం నుంచి స్పష్టమైన నిర్ణయం ఇంకా రానందువల్ల దానిపై ఆశ లు పెట్టుకోడానికి బదులుగా ప్రత్యామ్నాయం గురించి కెసిఆర్ ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా పార్టీకి అత్యంత విధేయులుగా ఉండే మంత్రుల్లోని కొద్దిమందిని పదవుల నుంచి తప్పించి, చేజారిపోతారనుకున్నవారికి మంత్రివర్గంలో చోటు కల్పించడంపై ఆలోచనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలకు ముందే మంత్రివర్గం లో మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు. కనీసం ఐదారుగురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని, కొత్త మంత్రివర్గంలో తప్పకుండా ఒక మహిళ ఉండబోతున్నారని సమాచారం. మరోవైపు ప్రభుత్వ పథకాలను పగడ్బందీగా అమలుచేసేందుకు వీలుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా తప్పనిసరి కానుంది. ముం దస్తు ఎన్నికలకు వెళ్ళాలనే అభిప్రాయం స్వయంగా కెసిఆర్‌కు లేకపోయినప్పటికీ కేంద్రం నుంచి అందుతున్న సంకేతాలకు అనుగుణంగానే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత ఏ మేరకు ఉందో పసిగట్టిన కెసిఆర్ దాన్ని మరింత విస్తృతపర్చడానికి ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇటీవలి గుజరాత్ ఫలితాలపై నిశితంగా విశ్లేషణ జరిపినట్లు తెలిసింది. అక్కడ దాదాపు ముప్పై నియోజకవర్గాల్లో రెండు వేల కంటే తక్కువ మెజారిటీతో మా త్రమే బిజెపి గెలవడానికి కాంగ్రెస్ ఓట్లను ఎన్‌సిపి, బిఎస్‌పిలు చీల్చడమే కారణమని కెసిఆర్ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. మోడీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందనేది గుజరాత్ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమవుతున్నందువల్ల అది టిఆర్‌ఎస్‌లో ప్రతిబింబించకుం డా ఉండేలా కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. ప్రదాని మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి గల కారణాల్లో గుజరాత్ ఫలితాలు ప్రధానమైనవని సమాచారం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, క ర్నాటక, త్రిపుర ఎన్నికలను కూడా పార్టీ దృష్టిలో పెట్టుకుంది. రాజస్థాన్‌లో బిజెపి చేజారిపోవచ్చని, మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీకి పూర్తి భరోసా లేకపోవచ్చని మోడీకి అందిన సమాచారంతో దాని ప్రభావం సాధార ణ ఎన్నికలపై పడరాదన్న ఉద్దేశంతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రి తం నాగపూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సమావేశంలో సైతం ముందస్తు ఎన్నికలపై విస్తృత చర్చ జరిగింది. పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసా రి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్రం ప్రతిపాదనకు తెలుగు రాష్ట్రా లతో పాటు మొత్తం 13 రాష్ట్రాలు సమ్మ తి తెలిపినట్లు చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం జరగలేదు.