Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

బుస కొడుతున్న పాములు..

Prevent or Respond to Snake Bite
జోగిపేటః వర్షాకాలం వచ్చిందంటే చాలు విషసర్పలు సంచారిస్తాయి..నాగు పాములు బుస కొడుతాయి. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. ఇటీవల అందోలు మండలం చందంపేట గ్రామానికి చెందిన చెన్నప్ప(55) అనే వ్యక్తి తన ఇంటి వద్ద నిద్రిస్తుండగా పాము కాటుతో మృతి చెందాడు. అలాగే చేగుంటలో మరోకరు పాముకాటుతో మృతి చెందిన సంఘటనలు మనకు విధితమే. ఇలా ప్రతి వానకాలం ఎంతో మంది పాము కాట్లకు మృత్యువాత పడుతున్నారు. పొలం పనులకు వెళ్లిన రైతులు, రైతు కూలీలు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చే వరకు ప్రాణాలు అరచేతిలో ఉంటాయని వారు భయందోళనను వ్యక్తం చేస్తున్నారు. మన తెలంగాణ సూచిస్తున్న ఈ క్రింది జాత్త్రాలను పాటిస్తే కొంత వరకు విషసర్పాల నుండి కాపాడుకోవచ్చు.
1.పాము కాటు వేస్తే ఆధైర్యపడకుండా ఉండాలి.
2. పాము కాటుకు గురైన భాగం నుంచి రక్తం పైకి వెళ్లకుండా కరిచినపై భాగంలో బట్ట లేదా దస్తీతో గట్టిగా కట్టుకట్టాలి.
3. పాము కాటు వేయగానే ఆలస్యం చేయకుండా సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు లేదా 108 సాయంతో ఎరియా ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి.
4.ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలి. నిర్లక్ష్యం చేస్తే విషం పైకి ఎక్కే ప్రమాదం ఉంటుంది.
5.పాము కాలుమీద కాటు వేస్తే మెదడు వరకు విషం ఎక్కేందుకు కొంత సమయం పడుతుంది. అదే తల భాగంలో కాని చేతి, నడుము భాగాల్లో కాటు వేస్తే త్వరగా వైద్యం అందించాలి.
6.నాటు వైద్యం, మంత్రాలను నమ్మకుండా సమయం వృధాకానివ్వద్దు. దీంతో ప్రాణాలను కొని తెచ్చుకున్నట్లవుతుంది.

7.పాముకాటుకు గురైన వారు వెంటనే ప్రాథమిక చికిత్సలు చేయించుకోవాలి.
8.కాటుకు గురైన భాగాన్ని సబ్బుతో కడిగి పరిశుభ్రమైన నోటితో ఆరోగ్యంగా ఉన్నవారు విషాన్ని నోటితో లాగి ఉమ్మివేయాలి.
9.నాటు వైద్యాన్ని నమ్మకుండా దవాఖానలకు తీసుకెళ్లాలి.
కాటువేయకుండా జాగ్రత్తలుః
1.కప్పలు, ఎలుకలు ఉన్న చోట పాములు ఎక్కువగా సంచారిస్తాయి. అందువల్ల అవి రాకుండా ఇళ్ల వద్ద, పంట పొలాల వద్ద శుభ్రంగా ఉంచుకోవాలి.
2.వ్యవసాయ క్షేత్రాలవద్ద పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇలాంటి ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు రైతులు, రైతు కూలీలు వెంట కర్రను, టార్చిలైట్‌ను తీసుకెళ్లడం మంచిది.

Comments

comments