Search
Sunday 23 September 2018
  • :
  • :

ఇసుక రవాణాను అరికట్టాలి

Tekumatla1

టేకుమట్ల: టేకుమట్ల మండలంలోని చలివాగు మరియు మానేరు వాగు పరివాహక గ్రామలైన బూర్నపల్లి తదితర గ్రామాలనుండి ఆక్రమ ఇసుక రవాణ తరలిపోతుందని తెలగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ అడెపు సంపత్ కుమార్ కు వినతి పత్రం గురువారం సమర్పించారు.మండలంలోని తహశీల్దార్ కార్యలయ ఆవరణలో ఉమ్మడి మండలాల ఎంపిపి బందెల స్నేహలత,తెలుగు దేశం పార్టీ ఉమ్మడి మండలాల అధ్యక్షులు పులి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొర్రె సాగర్ ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు అక్రమ ఇసుక రవాణా నిలుపివేయాలని వినతి పత్రం సమర్పించి వారు మాట్లాడుతూ మండలంలోని చలివాగు నుండి డబుల్ బెడ్‌రూంలు మరియు మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం ఇసుక పరిమితి తీసుకుంటూ మండల పరిధిలో లేని హైదరాబాద్ మరియు వరంగల్ లాంటి పట్టణాలలో సంబందిత అధికారుల అండదండలతో ఇసుకను తరలిస్తున్న వారిపై నిఘా విభాగం ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలన్నారు.

టేకుమట్ల మండలంలో వాగు పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న అవసరాలకు మరుగుదొడ్డి నిర్మాణలకు సంబందిత తహశీల్దార్ కార్యలయం నుండి పర్మిట్‌లు ఇవ్వాలని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నవారిపై తహశీల్దార్ నిఘా పెట్టి నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పనుల పేరుతో వరంగల్,హన్మకొండ పట్టణాలకు తీసుకువెళ్ళె లారీ పర్మిట్లను వెంటనే నిలుపివేయాలని తహశీల్దార్‌ను వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బందెల నరేష్,పెరుమాండ్ల రవీందర్,ఆడెపు సంపత్,టిడిపి నాయకులు తిప్పిరెడ్డి కృష్ణ రెడ్డి, స్థానిక సర్పంచ్ పెరుమాండ్ల లింగయ్య,ఆశిరెడ్డి పల్లి సర్పంచ్ మోతె రాజమౌళి,గంధము సారయ్య,దాసరి రాజయ్య,దాసరి కుమారస్వామి,మనోహార్,ఎనుగు లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments