Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

గొంతు గర గర నివారణకు…

rarఈ కాలంలో జలుబు బాగా ఇబ్బంది పెడుతుంది. దీనికితోడు గొంతు ఇన్‌ఫెక్షన్ కూడా. ఈ సమస్యను అధిగమించాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. గ్లాసు వెచ్చటి నీళ్లలో చెంచా చొప్పున దాల్చిన చెక్కా, మిరియాల పొడి కలపాలి. కాసేపయ్యాక వడకట్టుకొని పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేయడం వల్ల సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. 

గొంతు మంటా, పట్టేసినట్లు నొప్పి విపరీతంగా బాధిస్తుంటే దాల్చిన చెక్క నూనె చెంచా తీసుకొని అందులో మరో చెంచా తేనె కలిపి తాగితే ఫలితం ఉంటుంది. వీలును బట్టి వేణ్నీళ్లలో తేనె వేసుకొని పుక్కిలించినా చాలు. వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు అధికం. వెల్లుల్లిని మెత్తగా చేసి అందులో ఉప్పూ, కారం కొంచెం కలిపి వేడి వేడి అన్నంలో తీసుకుంటే రుచిగా ఉండటమే కాదు… గొంత ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. అలాగే అరకప్పు వేణ్నీళ్లలో చెంచా శొంఠిపొడీ, అరచెంచా నిమ్మరసం, అల్లం రసం, తేనె కలిపి పుక్కిలించాలి.
ఇలారోజుకు మూడుసార్లు చేస్తే నొప్పి, మంటా అదుపులోకి వస్తాయి.
కప్పు పాలలో చిటికెడు పసుపు చేర్చి తీసుకుంటే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమస్యను త్వరగా దూరం చేస్తాయి.

Comments

comments