న్యూఢిల్లీ: పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఒక్కసారిగా విరుచుపడుతున్నాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయల మార్కును కూడా దాటేసింది. రోజూ వారీ ధరల మార్పు విధానం అమలులోకి వచ్చిన తర్వాత ధరలకు రెక్కలు వచ్చేశాయనే చెప్పాలి. పెట్రో ధరల రోజూవారీ మార్పుతో సామాన్యుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. భాగ్యనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.76పైసలు ఉండగా, డీజిల్ ధర రూ.73.45పైసలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధానిలో ముంబయిలో పెట్రోల్ ధర అత్యధికంగా రూ.84.07కి చేరింది. భోపాల్లో రూ.81.83, పాట్నాలో రూ.81.73, శ్రీనగర్లో రూ.80.35గా ఉంది.