Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అగ్నిగుండంలో పడి గాయపడిన పూజారి

priest-Injured

రామనగర: కర్నాటక లో రామనగర జిల్లా అవ్వేరిహళ్లిలో ఓ పూజారి అగ్నిగుండంలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రతి సంవత్సరం ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచేందుకు పూజారి అగ్నిగుండంలో పరుగెత్తుతాడు. అగ్నిగుండంలో నడుస్తుండగా పూజారి విజయ కుమార్‌ అదుపు తప్పి అందులో పడిపోయాడు. దీంతో సదరు పూజారి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను బయటకు తీసేటప్పుడు కూడా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Comments

comments