Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

రామోజిపల్లిలో తెరుచుకొని ప్రభుత్వ పాఠశాల

Primary School Not opening In Ramoji Palli Village
రాయికోడ్ : తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని, ప్రైవేటుకు దీటుగా పాఠశాలలను నిర్వహిస్తున్నామని చెబుతున్న ఉపాధ్యాయులు ఆచరణలో వాటి మాటలకు వారే కట్టుబడి ఉండటం లేదు. మండలంలోని ఆయా పాఠశాలలు కొనసాగుతున్న తీరుపై నిఘా ఉంచాల్సిన మండల విద్యాధికారి తన ఏమి పట్లనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. మండలంలోని రామోజిపల్లి గ్రామంలోని పాఠశాల నేటి వరకు పునఃప్రారంభం కాలేదంటే ఎంఇఓ పని తీరుపై ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదని చెప్పవచ్చు. రామోజిపల్లి పాఠశాల పరిస్థితి ఇలాగుంటే మండలంలోని మామిడిపల్లి గ్రామంలోని పాఠశాలకు ఉపాధ్యాయలు హాజరుకావడం లేదు. పాఠశాలకు విద్యార్థులు హాజరవుతున్నా ఉపాధ్యాయులేమితో విద్యార్థులు వచ్చిన దగ్గర నుంచి తమకు ఇష్టమున్నంత సేపు పాఠశాల ఆరు బయట ఆటలాడుకుని అలసి, సొలసి పోయాక ఇండ్లకు వెళ్లిపోతున్నారు. గత 5 రోజులుగా పాఠశాలలో ఇదే తంతు కొనసాగుతోందని విద్యార్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మండలంలోని పీపడ్‌పల్లి గ్రామంలోని పాఠశాలలో 60 మంది విద్యార్థులు నమోదు కాగా శనివారం కేవలం 25 మంది విద్యార్థులే హాజరయినట్లు హాజరు రిజిష్టార్లు దృవీకరిస్తున్నాయి. పాఠశాలలో 7 తరగతులు కొనసాగుతుండగా అన్ని తరగతులకు ఒకే ఒక ఉపాధ్యాయుడు బోధన చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికి ప్రభుత్వం స్పందించి మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు నిత్యం కొనసాగేలా, ఉపాధ్యాయులు నిత్యం హాజరు అయ్యేలా చూడాలని మండల ప్రజలు సూచిస్తున్నారు.

Comments

comments