Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కింగ్‌డావో చేరుకున్న ప్రధాని మోడీ

modi

కింగ్ డావో:  శనివారం నుంచి ప్రారంభంకానున్న 18వ షాంఘై సహకారం సంస్థ (ఎస్ సివొ) వార్షిక సదస్సుకి ప్రధాన మంత్రి మోడీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం చైనాలోని కింగ్ డావోకు చేరుకున్నారు. ఇరాన్ న్యూక్లియర్ ఒప్పదం, రష్యాపై అమెరికా ఆంక్షలు, వాణిజ్యం, ఉగ్రవాదం, ఆరోగ్యం, వ్యవసాయం, ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లోని పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చలు జరపనున్నారు. గతేడాది ఆస్తానా వేదికగా పాకిస్థాన్ తో పాటు ఇండియాకు ఎస్ సివొలో శాశ్వత సభ్యత్వం లభించిన సంగతి తెలిసిందే. ఎస్ సివొలో సభ్యత్వం పొందిన తర్వాత ఈ సమావేశాల్లో పాల్గొనడం భారత్ ఇదే మొదటి సారి కావడం గమనార్హం. షాంఘై సహకార సంస్థలో మొత్తం 8 సభ్య దేశాలు ఉన్నాయి. దాదాపు 42శాతం ప్రపంచ జనాభా కలిగిన దేశాలు ఈ  సదస్సుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మోడీ సమీక్ష నిర్వహించనున్నారు. సభ్య దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడం తదితర అంశాలపై షాంఘై సమావేశాల్లో ప్రధాని చర్చలు జరపనున్నారు.

Comments

comments