Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మమత సిండికేట్ రాజకీయం

modi

మిడ్నాపూర్ ర్యాలీలో ప్రధాని మోడీ ధ్వజం

కుప్పకూలిన టెంట్, 90మందికి గాయాలు

మిడ్నాపూర్ : పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ కంచుకోటలో ప్రధాని నరేంద్ర మోడీ దీదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతోందని, సిండికేట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. మిడ్నపూర్‌లో సోమవారం జరిగిన కిసాన్ ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, 2022 నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ‘నా ప్రభుత్వం మీ ప్రభుత్వం. నాణ్యమైన విత్తనాలు మొదలుకొని మార్కెట్ దాకా మా ప్రభుత్వం రైతు సం క్షేమం కోసమే పని చేస్తోంది. పండించిన పం టను కాపాడుకోవడానికి గిడ్డంగులు అవసరం’ అని ఆయన అన్నారు. రాష్ట్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ,‘ పశ్చిమ బెంగాల్‌లో సిం డికేట్ల అనుమతి లేకుండా ఏ పని కూడా జరగదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్నారు’ అని అన్నారు. ఇటీవలజరిగిన పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకున్న హింసాకాండను ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్యం లోపించిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంకావాలన్నారు. రైతుల సంక్షేమం కోసం పని చేయాలని ఆయన తృణమూల్‌కాంగ్రెస్ ప్రభుత్వానికిహితవు చెప్తూ, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం రాష్ట్ర ప్రభు త్వం పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మన రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందన్నారు.
టెంటు కూలి 90 మందికి గాయాలు
ఆదిలా ఉండగా ప్రధాని మిడ్నపూర్ ర్యాలీలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంటు కూలిపోవడంతో కనీసం 90మంది గాయపడ్డారు. జోరున కురుస్తున్న వర్షంనుంచి ర్యాలీకి వచ్చిన జనానికి ఆశ్రయం కల్పించడం కోసం మెయిన్ ఎంట్రన్స్‌కు పక్కన ఈ టెంటును తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. అయితే ర్యాలీ జరుగుతున్నప్పుడు పెద్ద సంఖ్యలో బిజెపి కార్యకర్తలు ఈ టెంటులోకి చేరుకున్నారు. కొంతమంది అత్యుత్సాహానికి పోయి టెంటుకు సపోర్టుగా ఏర్పాటు చేసిన పోల్స్‌ను ఎక్కడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట ఏర్పడి టెంటు కూలిపోయింది. ర్యాలీలో ప్రసంగిస్తున్న ప్రధాని టెంటు కూలడం చూసి ప్రసంగాన్ని మధ్యలో ఆపి పక్కన ఉన్న ఎస్‌పిజి భద్రతా సిబ్బందిని చూసి గాయపడిన వారికి సాయపడేందుకు వెళ్లాలని వారిని ఆదేశించారు. గాయపడిన వారిని మోటారు సైకిళ్లపైన, ప్రధాని కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ర్యాలీ తర్వాత గాయపడిన వారిని ప్రధాని స్థానిక అస్పత్రిలో పరామర్శించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ప్రధాని తన ప్రసంగాన్ని కొద్ది సేపు ఆపేసి టెంటుపైకి ఎక్కిన వారంతా దిగి రావాలని, టెంటులోపల ఉన్న వారంతా బైటికి రావాలని కోరడం కూడా కనిపించింది.

Comments

comments