Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ప్రధాని మోడీ సహకార స్ఫూర్తి

PM Narendra Modi To Hold Pariksha Par Charcha With Students In Delhi Today

1991 94ల మధ్య హర్షద్ మెహతా ద్వారా జరిగిన అతి పెద్ద కుంభకోణంతో పాటు, రెండు సంవత్సరాల కిందట విజయమాల్య అనేక బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు ఎగురగొట్టి విదేశాలకు వెళ్లిన ఉదంతం మరువక ముందే ఈ మధ్య నీరవ్‌మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వందలాది కోట్లతో పెట్టిన శఠగోపం తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ నేపథ్యంలో బ్యాంకులు బడాబాబులకు నిలయాలుగా మారినందున మరో సారి సహకార సంఘాల సేవల గురించి, వాటి ఆవశ్యకత గురించి చర్చ ప్రారంభమైంది. ఈ సంఘాల ఆవశ్యకతను నొక్కి వక్కాణించడానికి ప్రధాని నరేంద్రమోదీ గత సంవత్సరం సెప్టెంబర్ 21న ఢిల్లీలో విజ్ఞాన భవన్‌లో లక్ష్మణ్‌రావ్ ఇనావ్‌ుదార్ జయంతి సందర్భంగా సహకార సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మణ్‌రావ్ ఇనావ్‌ుదార్ ముంబాయిని కేంద్రంగా చేసుకొని మహారాష్ట్రతోపాటు గుజరాత్‌లో ఎక్కువగానూ దేశవ్యాప్తంగా కూడా ప్రభావితం చూపించే విధంగా ఆ మధ్య సహకార ఉద్యమాన్ని నడిపారు. అందుకే ఆ మహనీయుని స్ఫూర్తిని దేశ వ్యాప్తంగా ఈ తరానికి తెలియజేయడానికి సహకార సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా వున్న అనేక కోఆపరేటివ్ సొసైటీలు, బ్యాంకుల ప్రతినిధులు సుమారు 12 వందల మంది పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ మహత్తర సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. ప్రపంచంలో మొదట సహకార ఉద్యమం 1752 1846 సంవత్సరాల మధ్య యూరోపియన్ దేశాలలో రాబర్ట్ ఓవెన్ ఆధ్వర్యంలో జరిగింది. 1844లో లండన్‌లో రాక్‌డేల్ పట్టణంలో మొదటి సహకార సంఘం ఏర్పడింది. అక్కడ ఒక కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులు వారి ఆర్థిక పరస్పర సహకారం కోసం 20 మంది నుంచి 30 మంది ఒక కూటమిగా ఏర్పడి వినియోగదారుల సహకార సంఘం (Consumers Co—————–operative Society) ఏర్పాటు చేసుకున్నారు. ఇది సత్ఫలితాలివ్వడంతో వెంటవెంటనే అచిరకాలంలోనే 1000 సహకార సంఘాలు రూపాంతరం చెందాయి. భారతదేశంలో బ్రిటీష్ ప్రభుత్వ హయాంలోనే బ్యాంకుల గురించి ప్రజలకు తెలియని రోజుల్లో 1904లో మొదటిసారి సహకార చట్టాన్ని తీసుకొచ్చారు.
దీనిని 1912లో కొంతమేర మార్చారు. 1928లో నాటి బ్రిటీష్ ప్రభుత్వం సహకార సంఘాల పనితీరు గురించి రాయల్ కమిషన్ వేసింది. 1954లో ప్రధాని నెహ్రూ ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేశారు. అప్పట్లో సహకార సంఘాల ఆవశ్యకతను నెహ్రూ సందర్భం వచ్చిన ప్రతిసారీ నొక్కి వక్కాణించి చెప్పేవారు. తర్వాత ఇందిరాగాంధీ ప్రధానిగా వున్నప్పుడు నెహ్రూ వేసిన కమిషన్ తరహాలోనే రివ్యూ కమిషన్ వేశారు. 1974లో మాధవ్‌దాస్ కమిటీ, 1975లో హజారే కమిషన్ వచ్చాయి. ఈ విధంగా రాజ్యాంగ భద్రత ద్వారా చట్ట పరిధిలో ఏర్పడిన సహకార సంఘాల సభ్యులకు, సమాజానికి చాలావరకు ఆర్థిక తోడ్పా టు నందిస్తూ వచ్చాయి. 1935లో ఏర్పడిన రిజర్వ్‌బ్యాంక్ అనుమతితో అనేక రకాల బ్యాంకులు ప్రజలకు వ్యాపార లావాదేవీలలో సేవలు అందించడానికి ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో సహకార సంఘాలు సహకార బ్యాంకులుగా మారుతూ వచ్చాయి. సహకార సంఘాల చట్టాలు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకనుగుణంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఏర్పడుతూ వస్తున్నాయి. ఈ విధంగా భారతదేశంలో 28 రాష్ట్రాలలో సహకార చట్టాలు అమలులో వున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రా ల సహకార సంఘాల చట్టాలను అజమాయిషీ చేసే విధంగా కేంద్ర సహకార చట్టం నేటికీ కొనసాగుతున్నది. 1984లో మల్టీస్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ పేరు తో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధి కింద పనిచేసే విధంగా కొత్త సహకార చట్టం వచ్చింది. 2002లో మరికొన్ని మార్పులు, చేర్పులతో కొత్త సహకార చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టమే సెంట్రల్ కోఆపరేటివ్ యాక్ట్ 2002 (బహుళార్ధ సహకార సంఘాల చట్టం 2002) కింద పిలుస్తున్నారు. నెహ్రూ ప్రధానిగా వున్నప్పుడు ప్రతిచోట సహకార సంఘాలు సమర్థవంతంగా పనిచేయాలి. వాటిని ప్రజలు సరైన విధంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేవారు. రాజీవ్ గాంధీ కూడా హజారే కమిషన్ ఇచ్చిన నివేదిక ద్వారా సహకార సంఘాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
గుజరాత్‌లో అప్పుడెప్పుడో సహకార సంఘం కింద ఏర్పడిన అమూల్ మిల్క్ పౌడర్ నేడు ప్రపంచ స్థాయిలో మార్కెట్ చేస్తున్నది. ఇలాగే మహారాష్ట్రలో అనేక చక్కెర కర్మగారాలు సహకార సంఘాల ద్వారా ఏర్పడి రైతులకు విశేషమైన సేవలు అందిస్తున్నాయి. ప్రపంచంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు సహకార రంగంలో నేడు ముందంజలో ఉండగా భారతదేశంలో మహారాష్ట్ర మొదటి స్థానం లో వుంది. ఇప్పుడు మహారాష్ట్రకు సమ ఉజ్జీగా గుజరాత్ పుంజుకుంటున్నది. మొత్తం మీద నేడు దేశవ్యాప్తంగా సహకార సంఘాలు ఇంచుమించు 30 వేల వరకు వున్నాయి. ఇందులో మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు కేవలం 12 వందలు మాత్రమే వున్నాయి. ఇవి సెంట్రల్ కోఆపరేటివ్ యాక్ట్ 2002 కింద పనిచేస్తున్నాయి. ఇందులో తెలంగాణలో కేవలం మూడు మాత్రమే ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 13 వరకు వున్నాయి. పైన పేర్కొన్న 30 వేల సొసైటీలలో 90% ఆయా రాష్ట్రాల సహకార చట్టాల కింద ఏర్పడినవి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1964 కోఆపరేటివ్ యాక్ట్‌తో పాటు 1995 కోఆపరేటివ్ మ్యాక్స్ యాక్ట్ ను తీసుకొచ్చా రు. 1964 యాక్ట్ కింద పనిచేస్తున్నవే నేటి జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సింగిల్ విండోలు), టౌన్ బ్యాంకులు వంటివి. ఇప్పుడు 1964 యాక్ట్ కింద ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వచ్చే దరఖాస్తులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఈ చట్టం ద్వారా రిజిష్టర్ అయితే ప్రభుత్వం తరపున నిధులు ఇవ్వవలసి వుంటుందనీ, ప్రభుత్వ అజమాయిషీ వుంటున్నందున అందుకు నిర్వహణ ఖర్చులు కూడా వుంటాయని రిజిస్ట్రేషన్ చేయడం లేదు. కాగా, ఈ ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం 1964ను మార్చి తమకనుగుణంగా మలచుకొనే విధంగా నూతన సహకార చట్టాన్ని తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. 1995 మ్యాక్స్ యాక్ట్ కింద పాల డయరీలు (పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘాలు) రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ యాక్ట్ కింద పనిచేసే సొసైటీలకు స్వయంప్రతిపత్తి వుంది.
ప్రభుత్వ భాగస్వామ్యం కింద సహకార సంఘాల స్ఫూర్తితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన విజయ ఆయిల్ కర్మాగారాలు చాలా చోట్ల మూతపడ్డాయి. ఈ తరహాలోనే చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా మూతపడ్డాయి. కాగా, నేటి తెలంగాణలో వరంగల్, కరీంనగర్ జిల్లాల సరిహద్దులో వున్న ములకనూరు కోఆపరేటివ్ సొసైటీ నేడు దేశ స్థాయిలో చర్చించుకునేవిధంగా అభివృద్ధిబాటలో పయనిస్తున్నది. ఇది 1995 మ్యాక్స్ యాక్ట్ కింద ఏర్పడింది.
ఇలాగే తెలంగాణలో కొడంగల్‌లో కొంతమంది మహిళలు ఒక కూటమిగా ఏర్పడి వారికి చదువు రాకపోయినా సరైన అవగాహనతో ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకొని తొమ్మిది పది గ్రామాల రైతులనుంచి కందులు కొని పప్పుగా మారుస్తూ సరాసరిన 10 కోట్ల వ్యాపారాన్ని టర్నోవర్ చేస్తున్నారు.
కాగా, నేడు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలలో సైతం శాఖలు ఏర్పాటు చేసుకున్న ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంక్ కూడా ఒకప్పుడు మల్టీస్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ కింద కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి తరువాత బ్యాంకుగా మారింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో అనేక చోట్ల బ్రాంచ్‌లు కలిగిన మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా పైన పేర్కొన్న విధంగా సెంట్రల్ కోఆపరేటివ్ యాక్ట్ (మల్టీస్టేట్ కోఆపరేటివ్ యాక్ట్) కింద కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి ఆ తరువాత బ్యాంకుగా మారింది. ఇదే విధంగా హైదరాబాద్ కేంద్రంగా2005లో ఏర్పడిన సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ (మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీ) ఐదారు రాష్ట్రాలలో శాఖలను ఏర్పాటు చేసుకొని 15 వందల కోట్ల టర్నోవర్‌తో నడుస్తున్నది.
ఈ తరహాలో ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఏర్పడి ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ నెల 25న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రములో సాయంత్రం 6.00 గంటలకు ముద్ర అగ్రి కోఆపరేటివ్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ, సహకార సంఘాలు ప్రజా చైతన్యం అనే అంశం మీద చర్చావేదికను ఏర్పాటు చేయడమైనది. ఇదే సందర్భంలో ‘ఉత్తేజం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ, జాతీయకవి, ప్రముఖ రచయిత టి.హెబ్బారు నాగేశ్వరరావు, ఇనిస్టిట్యూట్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ సంపత్‌కుమార్ తంగిరాల గార్లను లక్ష్మణ్‌రావ్ ఇనావ్‌ుదార్ స్మారక అవార్డ్ తో సత్కరిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల మేధావులను, ప్రముఖులను. ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నాం.

Comments

comments