Home జాతీయ వార్తలు ప్రధాని మోడీ ఆస్తులు ఇవేనట!

ప్రధాని మోడీ ఆస్తులు ఇవేనట!

PM Modiవారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుపిలోని వారణాసి లోక్ సభ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను ప్రధాని వెల్లడించారు. మోడీ మొత్తం ఆస్తుల విలువను రూ. 2.51 కోట్లుగా పేర్కొన్నారు. మార్చి 31 నాటికి తన చేతిలో రూ. 38, 750 ఉన్నాయని, బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 4,143గా చూపించారు. అలాగే తనకు ఎలాంటి అప్పులు లేవని ప్రధాని పేర్కొన్నారు. అంతేగాక తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా లేవని అఫిడవిట్ లో పొందుపరిచారు.

Prime Minister Modi lists Rs 2.5 Crore worth Assets