Home జాతీయ వార్తలు మోడీ వ్యాఖ్యలకు మండిపడ్డ ప్రతిపక్షం

మోడీ వ్యాఖ్యలకు మండిపడ్డ ప్రతిపక్షం

సమావేశాలు ముగిసే వరకు ప్రధానిని బహిష్కరిస్తామన్న కాంగ్రెస్ 

Modi-vs-Manmohan-Singh

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన ‘రెయిన్ కోట్’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంట్ ఉభయ సభల్లో పలుమార్లు నిరసన వ్యక్తం చేసింది. ప్రధాని క్షమాపణ చెప్పాలని పట్టుబట్టింది. ప్రధాని మోడీ చేసిన ‘రెయిన్ కోట్’ వ్యాఖ్యలను ఉపసంహరించుకునేంత వరకు బడ్జెట్ సమావేశాల్లో మొత్తం ఆయనను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు మరిన్ని పార్టీల మద్దతు కూడ గడతామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ గురువారం ఇక్కడ వెల్ల డించారు.

‘ప్రధానిని మేం బహిష్కరిస్తున్నాం. బడ్జెట్ భేటీ అయిపోయేంత వరకు ఆయన ఏం చెప్పినా వినబోం. అదే సమయంలో ప్రధాని కార్యాలయం గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించబోము’ అని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయలో ఈ అంశంలో తమ పోరాటం ఆగదన్నారు. తమతో మరికొన్ని పార్టీలు కూడా కలిసి వస్తాయని ఆశిస్తున్నామన్నారు. తిరిగి మార్చి 9న పార్ల మెంట్ సమావేశం అవుతున్నందున అప్పటి వరకు ప్రధాని వ్యతి రేక గళాన్ని కూడగడతామన్నారు.