Search
Friday 16 November 2018
  • :
  • :

నోట్ల రద్దు ప్రధాని వ్యక్తిగత నిర్ణయం: రాహుల్

Rahul-Gandhi

ఢిల్లీ: పెద్దనోట్ల రద్దు ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత నిర్ణయమని కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బుధవారం ఢిల్లీలో జనవేదన సమ్మేళనలో రాహుల్ ప్రసంగిస్తూ…. ఆర్‌బిఐ గవర్నర్ పదవిని మోడీ ఎగతాళి చేశారని దుయ్యబట్టారు. పేదలకు ప్రధాని సమయం ఇవ్వలేదన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లే దేశాన్ని నడిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మంచి రోజులు ఉన్నాయని, దేశం కోసం కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందని కొనియాడారు.  ఎఐసిసి ప్రెసిడెంట్ సోనియా గాంధీకి అనారోగ్యంగా ఉండటంతో ఈ సమావేశానికి హాజరుకాలేదు.

Comments

comments