Home మహబూబ్‌నగర్ అంబేడ్కర్ స్ఫూర్తితో మోదీ పరిపాలన

అంబేడ్కర్ స్ఫూర్తితో మోదీ పరిపాలన

ఎన్నికల్లో ధన ప్రవాహానికి స్వస్తి చెప్పి
నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తాం
బిజెపి శాసన సభా పక్షనేత కిషన్‌రెడ్డి

Kishan-reddy1

మనతెలంగాణ/వనపర్తి ప్రతినిధి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రధాని నరేంద్రమోడి దేశ పరిపాలనను కొనసాగిస్తున్నాడని బిజెపి శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తిలో బిజెపి సీనియర్ నాయకులు బచ్చురాం అంబేద్కర్ వర్దంతి సందర్బంగా ఉచితంగా ఇవ్వనున్న దుస్తువుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వచ్చభారత్‌కు సహకరిస్తున్న మున్సిపల్ కార్మికులకు ఆయన దుస్తువులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఎ న్నికల్లో ధన ప్రవాహానికి స్వస్తి చెప్పి నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందించేందుకు రూ.500, 1000 నోట్లను రద్దు చేయడం జరిగిందని, పేదోడికి కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం అందించేందుకు ప్రధాని నరేంద్రమోడి కంకణబద్దులై ఉన్నారని, దేశాన్ని పరిపాలించిన నేతలు వేలకోట్లు దోచుకుని నల్లధనంగా దాచుకున్నారని, ఆ డబ్బును వెలికి తీసి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది దిశగా నడిపించేందుకు నోట్ల రద్దుకు పూనుకున్నారని పాకిస్తాన్, భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషించేందుకు అక్కడ అంబేడ్కర్ స్ఫూర్తితో..

భారత డబ్బును ముద్రించి తిరిగి బారతదేశంలోకి పంపించడం వల్ల ఉగ్రవాదుల చర్యలు ఎక్కువ య్యాయని ఆయన అన్నారు. నోట్ల రద్దును దేశంలో 50 శాతం మంది ప్రజలు స్వాగతిస్తున్నారని, ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని బిజెపి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రతిపక్షాలు చేపట్టిన బారత్‌బంద్ పూర్తిగా విఫలమైందని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఉన్న 125 కోట్ల మందికి రూ.12తో జీవితభీమా సౌకర్యాన్ని ప్రవేవపెట్టారని, ఎరువులు, విత్తనాలు బ్లాక్‌మార్కెట్‌కు తరల కుండా జాగ్రత్తలు తీసుకుని రైతులను అన్ని విదాలుగా ఆదుకుంటున్నామని ఆయన తెలిపారు. కార్యక్ర మంలో బిజెపి జిల్లా అద్యక్షులు అయ్యగారిప్రబాకర్‌రెడ్డి, నాయకులు బి.కృష్ణ, సబ్బిరెడ్డివెంకట్‌రెడ్డి, నారాయణ, రాజవర్దన్‌రెడ్డి, నాగభూషణంగౌడు, కుమారస్వామి, శ్రీశైలం, సుమిత్రమ్మ, చిత్తారిప్రభాకర్, సీతారాములు, జగన్నాత్‌రెడ్డి, రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, కుమార్, బాబురావు, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.