Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ప్రధాని మోడీ విదేశీ పర్యటనల ఖర్చుల చిట్టా…

Prime Minister Narendra D Modi's foreign travel expenditure

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం 42 విదేశీ పర్యటనలు చేశారు. ఈ పర్యటనలకు అయిన మొత్తం వ్యయం అక్షరాల రూ. 355కోట్లు అని సమాచారం. పర్యటనల్లో భాగంగా మోడీ 165 రోజులు విదేశాల్లోనే ఉన్నారు. ప్రధాని విదేశీ పర్యటనలకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక లెక్కలను అందుబాటులో ఉంచింది. వీటిలో ప్రధాని ఏ దేశ పర్యటనకు ఎంతెంత ఖర్చు అయింది, ఎన్ని రోజుల పాటు పర్యటన కొనసాగింది, ఆ పర్యటనలో ఏఏ దేశాల్లో ప్రధాని పర్యటించారు అనే పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. కాగా, కొన్ని దేశాల పర్యటనలకు సంబంధించిన బిల్లులు ఇంకా రాలేదని కూడా పిఎంఒ వైబ్‌సైట్‌లో పేర్కొంది.

Comments

comments