Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

‘దేశం కోసం కాంగ్రెస్ పార్టీయే కాదు ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు’

Indian PM Modi

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రం మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భూకంపం వ్యాఖ్యలపై ప్రధాని సెటైర్ వేశారు. రాహుల్ చెప్పినట్లే భూకంపం వచ్చిందని(సోమవారం ఉత్తర భారతంలో వచ్చిన భూకంపాన్ని ప్రస్తావిస్తూ)… అయితే భూకంప కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందని చమత్కరించారు.

అనంతరం నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశ ప్రధాని కాగలిగారంటే అది ఈ దేశ ప్రజాస్వామ్య గొప్పదనమేనన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని ఓ కుటుంబం కబంధ హస్తాల కింద నలగకుండా జనశక్తియే కాపాడిందని ప్రధాని అన్నారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీయే కాదు వేరే వాళ్లు ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని మోడీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవానికి ముందే 1857లో సిపాయి తిరుగుబాటు వచ్చిందని, ఈ తిరుగుబాటుకు కూడా తామే కారణమని కాంగ్రెస్ చెప్పగలదా అని ప్రశ్నించారు.

ఇక బడ్జెట్ ముందే ఎందుకు ప్రవేశపెట్టారనే విషయమై ప్రధాని మాట్లాడుతూ… మనది వ్యవసాయ ఆధారిత దేశం కనుక రైతులకు తగినంత సహకారం అందించేందుకు ముందుగా ప్రవేశపెట్టినట్టు చెప్పారు. అలాగే సమగ్ర రవాణా విధానం కోసమే రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశమన్నారు. దీంతోపాటు పెద్దనోట్ల రద్దు అంశంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతోనే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

1988లో బినామీ ఆస్తుల చట్టాన్ని ప్రస్తావిస్తూ… బినామీ చట్టం ప్రవేశ పెట్టిన తర్వాత దాన్ని ప్రవేశపెట్టకపోవడమే మంచిదని కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగతమైందన్నారు. అందుకే ఇప్పటి వరకు ఈ చట్టం నోటిఫై కాలేదని తెలిపారు. ప్రస్తుతం బినామీ చట్ట నోటిఫై అయిందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అలాగే బినామీ ఆస్తులున్నవారందరికీ ఇదే చివరి అవకాశమని మోడీ చెప్పారు.

Comments

comments