Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

అవినీతిపై పోరాటంలో రాజకీయాలు వద్దు: ప్రధాని మోడీ

PM-MODI-Rajya-Sabha

న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా అవినీతిపై పోరాటంలో రాజకీయాలు లేవన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ఏకంగా 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఉగ్రవాదానికి నగదు అందకుండా చేశామన్నారు. నోట్ల రద్దు భవిష్యత్తులో మరిన్ని సత్ఫలితాలను ఇవ్వనుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. నోట్లరద్దుతో అంతిమంగా పేదలు లాభపడతారని చెప్పారు. ఇన్నాళ్లు భారత ఆర్థిక వ్యవస్థను నల్లధనం ఛిన్నాభిన్నం చేసిందన్నారు.

అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై మోడీ విమర్శలు గుప్పించారు. 35 ఏళ్లపాటు దేశ ఆర్థిక వ్యవస్థపై మన్మోహన్ ప్రభావం ఉందన్నారు. మన్మోహన్ వ్యవహారాన్ని బాత్రూంలో రెయిన్ కోట్ వేసుకుని స్నానం చేయడంతో పోల్చారు. మన్మోహన్‌పై మోడీ విమర్శలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.

కొద్దిసేపు ప్రధాని ప్రసంగానికి అడ్డంకం ఏర్పడింది. అనంతరం మోడీ మాట్లాడుతూ డిజిటల్ విధానాన్ని మరింత ప్రోత్సాహించాలని కోరారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 21 కోట్ల మందికి రూపే కార్డులు ఇచ్చామని చెప్పారు. రూపే కార్డు కలిగి ఉండడం ఓ స్టేటస్ మారిందని తెలిపారు. ప్రస్తుతం 60 నుంచి 70 శాతం రైల్వే టికెట్లు ప్రజలు ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారన్నారు. చంద్రబాబు కమిటీ ఇచ్చిన రిపోర్టుపై కూడా అధ్యాయనం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్‌బిఐ గవర్నర్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు.

Comments

comments