Home జాతీయ వార్తలు అత్యాచార యత్నం కేసులో ప్రిన్సిపల్ అరెస్టు

అత్యాచార యత్నం కేసులో ప్రిన్సిపల్ అరెస్టు

RAPEగుడ్‌గావ్ : తన పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్ధినిపై అత్యాచార యత్నం చేసిన కేసులో ఆ పాఠశాల ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గుడ్‌గావ్‌లో జరిగింది. గుడ్‌గావ్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ అదే పాఠశాలలో చదువుతున్న తొమ్మిదేళ్ల బాలికను తన ఆఫీసుకు పిలిశాడు. అనంతరం ఆ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక భయపడి ఏడ్వడంతో ఎవరికీ చెప్పొద్దని బెదిరించి పంపించేశాడు. మరుసటి రోజు బాలిక పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఆ బాలికను తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో ప్రిన్సిపల్ అఘాయిత్యంపై ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ రామ్‌గోపాల్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.