Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

మహిళల భద్రతకు ప్రాధాన్యం

 kdm

మహిళల సమస్యల పరిష్కారానికే వన్‌స్టాఫ్ సెంటర్లు 

త్వరలో అన్ని జిల్లాల్లో సెంటర్ల ఏర్పాటు
 ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

మనతెలంగాణ/ వరంగల్ బ్యూరో: మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వన్‌స్టాఫ్ సెంటర్‌లను ఏర్పాటు చేయ డం జరుగుతుందని, ఇవి మహిళలకు ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అ న్నారు. శనివారం హన్మకొండలో ఏర్పాటు చేసిన వన్‌స్టాప్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడు తూ, మహిళలకు అన్నివిధాలుగా అండగా ఉంటూ వేధింపు లు, హింస నుంచి వారికి రక్షణ కల్పించే విధంగా వన్‌స్టాప్ సెంటర్ హన్మకొండలో ఏర్పాటు చేయడం, మహిళల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని ఆయనన్నారు. గతంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగిన, గృ హహింస చేసిన మహిళలు అనేక కేంద్రాలకు తిరగవలసి వచ్చేదని సమస్య పరిష్కారానికి ఫిర్యాదు చేయడానికి ఇం కా అలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, నూతనంగా ఏర్పాటు చేసిన 21 జిల్లా కేంద్రా ల్లో కూడా వన్‌స్టాప్ మహి ళా సహాయక కేంద్రాలను ఏర్పా టు చేయుటకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంప డం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం కూడా మిగతా జిల్లాలలో వన్‌స్టాప్ సెంటర్‌లను మం జూరి చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని, త్వరలోనే మిగతా జిల్లాల్లో వన్‌స్టాఫ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మహిలా సమస్యలను ఒక వేదిక ద్వారా పరిష్కరించుటకు ఆయనన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ రకాల వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి అనేక సహాయ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని, షీటీంలు, 181 హెల్ప్‌లైన్, డివి సెల్ఫ్ గతంలో పనిచేస్తున్నాయని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అన్నారు. మహిళలకు తక్షణ సహాయంలో భాగంగా కౌన్సిలింగ్, వైద్య సహాయం, తాత్కాలిక వసతి, న్యాయ సహా యం, పోలీసు సహాయం 24 గంటలు ఇట్టి సహాయాలు అందించడానికి ఈ కేంద్రం అందుబాటులో ఉంటుందన్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జి.పద్మ, ఎంఎల్‌సి శ్రీనివాస్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు వినయభాస్కర్, ఆరూరి రమేష్, మహిళా కో ఆర్డినేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ జి.సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి తది తరులు పాల్గొన్నారు.

Comments

comments