Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సచిన్ శిక్షణలో పృథ్వీ షా

Prithvi Shaw trains with Sachin

ముంబయి: ప్రస్తుతం టీమిండియాలో యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు కల్పిస్తున్నారు బిసిసిఐ సెలక్టర్లు. దీంతో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు యువ ఆటగాళ్లతో కళకళలాడుతోంది. ఈ క్రమంలోనే విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్ లో సీనియర్లను కాదని 19 ఏళ్ల పృథ్వీ షాను జట్టులోకి తీసుకున్నారు. షా అరంగేట్ర టెస్టులోనే శతకంతో అదరగొట్టాడు. సెలక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. తొలి టెస్టులో సెంచరీతో, రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో మొత్తంగా 237పరుగులు సాధించి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన షాకు ఈ నెలలో ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు టీమిండియాలో చోటు దక్కింది.

ఆసీస్ సిరీస్ కు సన్నద్ధం అవుతున్న పృథ్వీ తాజాగా క్రికెట్ గాడ్ సచిన్‌ తెందుల్కర్ అకాడమీలో నెట్స్‌లో చెమటోడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆసీస్‌ పర్యటనకు ఏవిధంగా సన్నద్ధం కావాలో సచిన్ షాకు సలహాలు ఇస్తున్నట్లు అకాడమీ వర్గాల సమాచారం. దీనిలో భాగంగా సచిన్‌ ఆసీస్‌ పిచ్‌లపై ఏవిధంగా బ్యాటింగ్‌ చేయాలో, దూసుకొచ్చే బంతులను ఎలా ఎదుర్కొవాలో అతనితో పూర్తిస్థాయిలో చర్చించారట. సచిన్, ప్రశాంత్‌ శెట్టి, జగదీశ్‌ చాహన్‌ కలిసి పృథ్వీతో అకాడమీలో సుమారు గంటకు పైగా ప్రాక్టీస్‌ చేశారట. ఆసీస్ పర్యటన నేపథ్యంలో పృథ్వీ పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో ఉండేందుకు సచిన్‌, జగదీశ్ ఇరువురూ పృథ్వీకి రబ్బరు బంతితో శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Prithvi Shaw Trained in Sachin Tendulkar Academy

Telangana Breaking News

Comments

comments