Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఇండిగో ‘స్పెషల్‌ ప్రమోషనల్‌’ ఆఫర్

IndiGo-Airlines

ముంబయి: ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో ‘స్పెషల్‌ ప్రమోషనల్‌’ పేరుతో ఓ కొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది. దీనిలో భాగంగా రూ.970లకే విమాన టికెట్‌ను అందిస్తోంది.  ఆగస్టు 16 వరకు ఇండిగో ఈ ఆఫర్ ను అందుబాటులో ఉంచింది. ఇలా బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా  ఆగస్టు 26 నుంచి మార్చి 24, 2018 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించే అవకాశం కల్పించింది.

ఈ ఆఫర్ ద్వారా హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, మదురై, మంగళూరు, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, అహ్మదాబాద్, అమృత్‌సర్‌, బాగ్డోగ్ర, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, డెహ్రాడూన్, ఢిల్లీ, గౌహతి, పోర్ట్ బ్లెయిర్, పూణే, శ్రీనగర్, తిరువనంతపురం, ఉదయపూర్, వడోదర తదితర  ఎంపిక చేసిన మార్గాల్లో నాన్‌స్టాప్‌ విమానాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేగాక ప్రయాణానికి 15 రోజులకు ముందు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Private carrier IndiGo is offering tickets from Rs. 970 as part of a special promotional offer.

Comments

comments