Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ పశువైద్యశాలలో ప్రైవేట్ మెడికల్ స్లిప్‌లు!

Government-Veterinary-Hospi

వనపర్తి: గ్రామీణ ప్రాంతాల్లోని పేద రైతుల కోసం ప్రభుత్వ పశువైద్యశాలల ద్వారా ఉచితంగా మందులు సరఫరా చేస్తుంటే ఆ శాఖలో పని చేసే కొందరు అవినీతి అధికారులు రెక్కాడితే డొక్కాడని పేద రైతులను దోచుకోవడం మొదలు పెట్టారు.  వైద్యంతో పాటు ప్రభుత్వం మందులు ఉచి తంగా సరపరా చేస్తున్నప్పటికి  మందుల కొరత సృస్టించి ప్రైవేట్ మెడికల్ షాపులకు మందులను రెఫర్ చేస్తు ప్రభుత్వ మందులను ప్రైవేట్ మెడికల్ షాపులో విక్రయిస్తూ లక్షల రూపాయలు పశు వైద్య శాఖాధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

శనివారం మండల పరిధిలోని చిమనగుంటపల్లి గ్రామంలోని పశు వైద్య శాలలో  ఓ ప్రైవేట్ మెడికల్ షాపుకు సంబంధించి మందుల రిస్క్రిప్సన్ లు కనిపించడం విశేషం.ప్రభుత్వం సరపరా చేసిన మం దులను వైద్యానికి ఉపయోగించాలిసి ఉండగా ప్రైవేట్ మెడికల్  షాపులకు మందులు ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించగా మెడికల్ షాపుల యజమానులు తమ దగ్గర ఉంచారని వైద్యాదికారి పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గతంలో పవన్ కుమార్‌రెడ్డివనపర్తిలోని ఓ మెడికల్ షాపును నిర్వహిస్తున్నారని  నిర్వహిస్తున్నారని ప్రభుత్వ మందులను రైతులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య ముసుగులో ప్రైవేట్ మందుల దుకాణాలకు నాట్‌ప ర్‌సేల్ మందులను తరలించి అక్కడ వాటిని డబ్బులు తీసుకుని రైతులకు అంట గడుతున్నట్లు తెలుస్తుంది.

మెడికల్ షాపు యజమానులు స్లిప్‌లు ఇస్తుంటారు…  పశువైద్యాధికారి పవన్‌కుమార్‌రెడ్డి

ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రికి ప్రైవేట్ మెడికల్‌షాపుల యజమానులు క్యాంపు నిర్వహించే సమయంలో స్లిప్ లు ఇస్తుంటారని పశువైద్యాదికారి పవన్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. ప్రైవేట్ మెడికల్ షాపులకు ప్రభుత్వ సరపరా చేసిన మందులను తరలించడం లేదని పవన్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ విషయమై జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ విజయరాజ్ ను వివరణ కోరగా విచారణ చేపట్టి కలెక్టర్ కు నివేదికను అందజేస్తామని వివరణ ఇచ్చారు.

Comments

comments