Home రాష్ట్ర వార్తలు ప్రైవేటు యూనివర్సిటీలు సమాజానికి మంచిది కాదు

ప్రైవేటు యూనివర్సిటీలు సమాజానికి మంచిది కాదు

టి.జెఎసి చైర్మన్ ప్రొ. కోదండరాం
ఒయులో విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రౌండ్ టేబుల్
ఈ నెల 17 న ప్రభుత్వ శవయాత్ర, 23న చలో అసెంబ్లీకి పిలుపు

Kodanda-ram1

ఉస్మానియా యూనివర్సిటీ: ప్రైవే టు యూనివర్సిటీల ఏర్పాటు సమాజానికి మంచిది కాదని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదం డరాం పేర్కొన్నారు. ఒయులో విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని శుక్రవారం ఆర్ట్ కళాశాల న్యూసెమి నార్ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రొ.కోదండరాం మాట్లాడుతూ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును అడ్డుకునే శక్తి విద్యార్థులకే ఉందన్నారు. విద్యారంగాన్ని సేవా రంగంగా మాత్ర మే చూడాలని, వ్యాపార రంగంగా మార్చవద్దన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యా ర్థులకు కేజి నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిం చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. తెలం గాణ రాష్ట్రంలో ప్రభుత్వరంగంలో ఉన్న యూనివ ర్సిటీలను బలోపేతం చేయడంతోపాటు జనాభా నిష్ప త్తికి అనుగుణంగా కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అనం తరం ఔటా అధ్యక్షులు ప్రొఫెసర్ బట్టు సత్యనారా యణ మాట్లాడుతూ ప్రస్తుతం బ్లాక్ గ్రాంట్ ఇవ్వ కుండా ప్రభుత్వ రంగంలో ఉన్న యూనివర్సిటీలను ప్రభుత్వమే నిర్లక్షం చేస్తుందన్నారు. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడంలేదని, దీంతో యూనివర్సిటీల మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుం దని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొ.చెన్న బస వయ్య, డా.కాశీం, డా. కొండానాగేశ్వర్‌రావు, టిపి టిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి.మనోహర్‌రాజు,టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నర్సిరెడ్డి, డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కిష్టప్ప, పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు హన్మేష్, డివైఎఫ్‌ఐ నాయకులు విజయ్‌లు హాజరై ప్రసంగిం చారు.

ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జూపాక శ్రీనివాస్, కెఎస్ ప్రదీప్, ఎస్ ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వేణు, ఓ.యూ నాయకులు ఆర్‌ఎన్ శంక ర్, కాంపల్లి శ్రీనివాస్, టివివి అధ్యక్షులు మహేష్, పిడిఎస్‌యు అధ్యక్షులు పస్క నర్సయ్య, ఏఐడిఎస్ యూ నాయకులు గంగాధర్, పిడిఎస్‌యు నాయకు రాలు సత్యవతి, విద్యార్థి నాయకులు నాగేశ్వర్ రావు, శంకర్, రాజేందర్, తిమ్మిడి నాగరాజు, మూర్తి, రంజి త్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుపై ఐక్యాకార్యచరణ ఆందోళన కార్యక్రమాలకు పిలుపు
రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతి రేకిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఐక్య కార్యా చరణకు పూను కోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శవ యాత్రలు చేయాలని, ఈనెల 18న రోడ్లపై సామూ హిక బోజనాలు, ఈ నెల 19న ఎమ్మెల్యే క్వార్టర్స్ ముట్టడి, ఈ నెల 21 న యూనివర్సిటీల బంద్, ఈ నెల 23న చలో అసెం బ్లీ కార్యక్రమాలను చేపట్ట నున్నట్లు విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు తెలిపారు.