Home జాతీయ వార్తలు రైల్వే ప్రైవేటీకరణ ప్రతిపాదన లేదు

రైల్వే ప్రైవేటీకరణ ప్రతిపాదన లేదు

Piyush Goyal

 

న్యూఢిల్లీ: రైల్వే రంగం ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పందించింది. అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. తేజస్ ఎక్స్‌ప్రెస్ సహా మరో రైలును ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రైవేటీకరణపై లోక్‌సభలో ప్రతిపక్షాలు స్పందించాయి. దీనికి స్పందించిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏ ప్యాసింజర్ రైలును కూడా ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వాలని నిర్ణయించలేదు’ అని లిఖితపూర్వకంగా తెలిపారు. రైల్వేలను ప్రైవేటీకరించే ప్రతిపాదనేదీ లేదని గోయల్ తన సమాధానంలో పేర్కొన్నారు.

Privatising Railways will affect everyone