Home రాజన్న సిరిసిల్ల ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడి ఆరికట్టాలి..

ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడి ఆరికట్టాలి..

Privilege of private educational institutions' fees
ఎల్లారెడ్డిపేట : ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడికి అడ్డుకట్ట వేసి ఆరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మల్లారపు అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన అరుణ్‌ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి సంవత్సరం ఇష్టానుసారంగా ఫీజులను పెంచుకుంటూ పోతున్నారన్నారు. పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు దోపిడీకి గురిచేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు పాటించకుండా ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాంలు, ఇతర సామాగ్రి అంటూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు కమీషన్‌లకు కక్కుర్తి పడి విద్యా వ్యవస్థను వ్యాపారంగా చేసుకొని, అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తూ పిట్‌నెస్‌ లేని బస్సులలో విద్యార్థులను తీసుకురావడం చేస్తున్నారన్నారు. ఇంకా కొన్ని పాఠశాలలు ఆటోలు, జీబులు, ఇతర వాహనాల్లో తరలిస్తున్నారని, దీంతో విద్యార్థులు ప్రమాదపు అంచున ప్రయాణం సాగించాల్సి వస్తుందని ఆరోపించారు. తక్షణమే ఇలాంటి విద్యా సంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశాంత్, మండల అధ్యక్షడు దినకర్, కార్యదర్శి రాకేశ్, నాయకులు ప్రణీత్, కళ్యాణ్, మనోజ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.