Home దునియా నేను పక్కా అల్లరి పిల్లని

నేను పక్కా అల్లరి పిల్లని

Priya Prakash Varrierప్రియా వారియర్ నటించిన ఒరు ఆధార్ లవ్ చిత్రం దక్షిణ భారతదేశంలోని నాలుగు భాషల్లో విడుదలవుతోంది. కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తంగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో వల్లనే ఒరు ఆధార్ లవ్ చిత్రానికి ఈ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇటీవల ప్రియా వారియర్ లవర్స్ డే ఆడియో వేడుక కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని మొదట చిన్న సినిమాగా ప్రారంభించాం. కానీ ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం విడుదలయ్యే స్థాయికి చేరుకుంది. కొత్తవాళ్ళమైనా మాకు ఇంతకన్నా ఏం కావాలి అని అంటోంది. ఎక్కడికి వెళ్లినా కన్ను కొట్టమని అడుగుతున్నారు. నాకైతే బోర్ కొడుతోందని అంటోందీ చిన్నది. వాలంటైన్స్ డే రోజునే ‘లవర్స్ డే’(ఒరు ఆధార్ లవ్) తెలుగులోనూ, హిందీలోనూ విడుదల కానున్నట్టు చెబుతోంది.

పేరు : ప్రియా ప్రకాశ్ వారియర్
పుట్టిన రోజు : 12 సెప్టెంబర్ 1999
చదువు : బీకాం సెకండ్ ఇయర్ (ప్రస్తుతం)
తల్లి : ప్రీతా
తండ్రి : ప్రకాశ్ వారియర్
ఫేవరెట్ ఫుడ్ : హైదరాబాద్ బిర్యానీ
హాబీస్ : పుస్తకాలు చదవడం
ఇష్టమైన హీరోలు: బన్నీ, విజయ్‌దేవరకొండ, రానా
సినిమాలు : ‘ఒరు ఆధార్ లవ్’ (మళయాలం),
‘లవర్స్ డే’(తెలుగు), శ్రీదేవి బంగ్లా(హిందీ).

Priya Prakash Varrier Lovers Day