Home వార్తలు వ్యాపారవేత్తతో ప్రియమణి నిశ్చితార్థం

వ్యాపారవేత్తతో ప్రియమణి నిశ్చితార్థం

priya-maniతెలుగులో ‘ఎవరే అతగాడు’ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన ప్రియమణి… ఆతర్వాత ‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం తమిళ్‌లో తను నటించిన ‘పరుత్తి వీరన్’ సినిమాకు 2006లో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. తర్వాత చాలా సినిమాల్లో నటించినా అవి తన కెరీర్‌ని మంచి స్థాయికి తీసుకెళ్లలేకపోయాయి. ప్రస్తుతం కథానాయికగా అవకాశాలు లేని ప్రియమణి పెళ్లికి సిద్ధమైందన్న వార్తలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే. వాటిని నిజం చేస్తూ ప్రముఖ వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌తో బెంగుళూర్‌లోని బనశంకరిలోని తన స్వగృహంలో ప్రియమణి నిశ్చితార్థం జరిగింది. ఈ సంవత్సరంలోనే వీరి పెళ్లి కూడా జరగుబోతున్నట్టు తెలిసింది. ఈ నిశ్చితార్థంతో గత కొన్నాళ్లుగా హల్‌చల్ చేస్తున్న ప్రియమణి పెళ్లి వార్తలకు శుభంకార్డు పడింది.