Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రూ.12 కోట్ల పారితోషికం!

Priyanka Chopra charged Rs 2 crore for her IIFA act

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకచోప్రా ఈమధ్య హాలీవుడ్ సినిమాలు చేస్తూ న్యూయార్క్ నగరంలో నివసిస్తోంది. అక్కడ  పాపులర్ సింగర్  నిక్ జోన్స్ అనే యువకుడితో ఈ భామ ప్రేమాయణాన్ని కొనసాగిస్తోందని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ ప్రేక్షకులు  ప్రియాంక రాకకై వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.  ఈ భామ ఇప్పుడు సల్మాన్‌ఖాన్‌తో ఓ సినిమా చేస్తోంది. అలీ అబ్బర్ జాఫర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘భారత్’ అనే సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మొదట ఈ సినిమాకు ఆమె 14 కోట్లు డిమాండ్ చేసిందట. కానీ అంత కష్టమని 12 కోట్లు అయితే ఇవ్వగలమని అనడంతో ప్రియాంక ఈ సినిమాకు ఓకే చెప్పిందట.  సౌత్ కొరియన్ మూవీ ‘ఓడే టు మై ఫాదర్’కు ఈ చిత్రం రీమేక్‌గా ఈ రూపుదిద్దుకుంటోంది. దీనిని సల్మాన్ భావ అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ దిశా పటానీ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

Comments

comments