Home సినిమా నిక్ పాటకి ప్రియాంక చిందులు..!(వీడియో)

నిక్ పాటకి ప్రియాంక చిందులు..!(వీడియో)

Priyanka Chopra danceముంబయి: దాదాపు ఏడాదిపాటు సహజీవనం చేసిన ప్రేమ జంట.. బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా(36), అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌(26)లు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని ఉమాయిద్ భవన్ ప్యాలెస్‌లో శనివారం అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఇవాళ(ఆదివారం) వారిరివురు హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఒక్క‌టి కానున్నారు. న‌వంబ‌ర్ 29 నుండి ప్రియాంక పెళ్లికి సంబంధించిన హంగామా మొద‌లు కాగా, రేప‌టితో వేడుక‌లు ముగియ‌నున్నాయి. ఇరువురి కుటుంబసభ్యులతో పాటు కొంతమంది అతిథులు, పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు, రిలయన్స్‌ దిగ్గజం అంబానీ కుటుంబసభ్యులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

ఇక పెళ్లి సంగీత్‌లో ప్రియాంక‌, జోనస్‌లతో పాటు వారి కుటుంబ స‌భ్యులు అదిరిపోయే స్టెప్పులతో దుమ్ములేపార‌ట‌. అయితే తాజాగా ప్రియాంక‌, నిక్‌ల సంబంధించి ఓ వీడియోని వోగ్ మ్యాగ‌జైన్ విడుద‌ల చేసింది. ఇందులో జోనస్‌ గిటార్ వాయిస్తూ పాట పాడుతుంటే.. ప్రియాంక అందుకు త‌గ్గ‌ట్టు స్టెప్పులు వేసింది. ఈ పాటకి ప్రముఖ హాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ సెలియా రోల్సన్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేశారట. ప్రస్తుతం ప్రియాంక, నిక్ ల పెళ్లి సెన్సెషన్ అవుతున్న తరుణంలో ఈ వీడియో సాంగ్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.