Home సినిమా సంపాదనలో రికార్డు

సంపాదనలో రికార్డు

Priyanka Chopra Earns Income Of Rs 68 crore

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పలు విశేషాలతో వార్తల్లో నిలుస్తోంది. గత కొంతకాలంగా అమెరికన్ గాయకుడు నిక్‌జోన్స్‌తో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న ఈ బ్యూటీ త్వరలో అతన్ని పెళ్లాడనుంది. అయితే ఇటీవల సల్మాన్‌ఖాన్ చిత్రం ‘భారత్’ నుంచి ఆమె తప్పుకోవడంతో ఆమె గురించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు ప్రియాంక మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ బ్యూటీ గత ఏడాది భారీగా సంపాదించింది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం 2017 సంవత్సరంలో ప్రియాంక 60 కోట్ల రూపాయలు సంపాదించి బాలీవుడ్, సౌత్ హీరోయిన్‌లు అందరికంటే ఎక్కువ మొత్తం సంపాదించిన హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది. అమెరికన్ టివి షో క్వాంటికో సిరీస్, హాలీవుడ్ సినిమాలు, కమర్షియల్ యాడ్స్‌తో ప్రియాంక ఇంత పెద్ద మొత్తాన్ని సంపాదించింది.