ముంబయి : బాలీవుడ్లో విజయవంతమైన నటిగా పేరు సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా గతంలో మూడుసార్లు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిందని ఆమె మాజీ మేనేజర్ ప్రకాశ్ జాజు అన్నారు. తన మాజీ బాయ్‌ఫ్రెండ్ అసీమ్ మర్చంట్ త ల్లి 2002లో చనిపోయినప్పుడు ప్రియాంక చోప్రా చనిపోవాలనుకుందని వెల్లడించాడు. ఇంటి కారిడార్ నుంచి దూకి చనిపోవాలనుకున్నప్పుడు తాను వెళ్లి పట్టుకున్నానని చెప్పాడు. సినిమా పరిశ్రమలో ఆత్మహ త్యలు చేసుకోవాలనుకునే మనస్తత్వం గురించి ప్రస్తావిం చడమే తన ఉద్దేశమని ప్రకాశ్ జాజు చెప్పాడు. అసీమ్, ప్రియాంక ప్రతిరోజూ కొట్లాడుకునేవారని చెప్పాడు.