Home తాజా వార్తలు బ్రతికుండగానే చంపేస్తారా: నటి ప్రియాంక ఫైర్

బ్రతికుండగానే చంపేస్తారా: నటి ప్రియాంక ఫైర్

 Priyanka has been angry with social media channels
హైదరాబాద్: తను బ్రతికి ఉండగానే చంపేశారని తెలుగు బుల్లితెర నటి ప్రియాంక సోషల్ మీడియా ఛానల్స్ పై ఆగ్రహాం వ్యక్తం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తెలుగు టీవీ సిరియల్ నటి ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు రాశాయి. ఈ వార్తల పై స్పందించిన ఆమె మండిపడ్డారు. లైవ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోస్ట్ లో నేను చాలా బ్యాడ్ పరిస్థితుల్లో లైవ్‌కి రావాల్సి వచ్చింది. మీకు ఏం పని పాటా లేదా, ఇప్పుడు నేను దెయ్యాన్నా.. మీతో లైవ్లో మాట్లాడుతుంది నా  ఆత్మనా, నేను చచ్చిపోయానా అంటూ మీడియాపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. వ్యూస్ కోసం, మీ రేటింగ్ పెంచుకొవటం కోసం జనాల్ని చంపైస్తారా అని ఫైర్ అయ్యింది. నా ఫోటో పెట్టి బుల్లితెర నటి ప్రియాంక ఆత్మహత్య అని ఏదైతే రాసారో అది వెంటనే తీసేయండి. అలా చేయకపోతే సీరియస్ గా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఆమె అన్నారు.