Home సినిమా ప్రియాంక పెళ్లి బాజాకు వేళయింది

ప్రియాంక పెళ్లి బాజాకు వేళయింది

priyanka

గత కొంతకాలంగా ప్రియాంక చోప్రా పెళ్లి గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ భామ తన బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్‌తో నిశ్చితార్థం పూర్తి చేసుకుందని… తొందరనే పెళ్లి చేసుకోనుందనే ప్రచారం సాగుతోంది. ప్రియాంక దాగుడుమూతల వ్యవహారం గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఆమె స్పందించకపోవడంతో సస్పెన్స్ నెలకొంది. అయితే ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ‘భరత్’ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ చేసిన ప్రకటన సంచలనమైంది. “ప్రియాంక పెళ్లి బాజాకు వేళయింది. సల్మాన్ సరసన క్రేజీ ప్రాజెక్ట్ ‘భరత్’ నుంచి తప్పుకోవడానికి కారణమిదే”’ అని జాఫర్ తెలిపాడు. అంతేకాదు పెళ్లి బంధంతో ఓ ఇంటిదవుతున్న ప్రియాంకకు ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. ఈనెల 22 నుంచి ‘భరత్’ రెగ్యులర్ చిత్రీకరణ మొదలైంది. అయితే ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నానని ప్రియాంక చెప్పిందని జాఫర్ తెలియజేయడంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్‌గా మారింది. దీంతో ప్రియాంక… నిక్ జోనాస్‌ను పెళ్లాడి జీవితంలో స్థిరపడుతుందన్న మాట.