Search
Sunday 23 September 2018
  • :
  • :

సోషల్ మీడియాలో సందడి

Priyanka-Chopra

ఏమాత్రం గ్యాప్ లేకుండా వార్తల్లో నిలుస్తోంది ప్రియాంక చోప్రా. హాలీవుడ్ అవకాశాలు, ఆపై ప్రేమాయణం, ఆవెంటనే నిశ్చితార్థం, బాలీవుడ్ మూవీ ‘భరత్’ నుంచి తప్పుకోవడం… ఇలా గ్యాప్ లేకుండా ఈ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ప్రియాంక హాట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘క్వాంటికో 3’కు సంబంధించిన వీడియో ఇది. ఇందులో తన సహ నటుడితో ప్రియాంక చేసిన హాట్ రొమాన్స్ వీడియో వైరల్‌గా మారిందిప్పుడు. ఇందుకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు వైరల్‌గా మారింది. ప్రియాంక ఫ్యాన్ పేజీ వాళ్లెవరో ఈ వీడియోను షేర్ చేశారు. అయితే ఆ క్వాంటికో నటుడితో ప్రియాంక రొమాన్స్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా వీరిద్దరూ లిప్‌లాక్స్‌లో మునిగితేలారు. అయినప్పటికీ వీరి తాజా హాట్ రొమాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తనకన్నా వయసులో చాలా చిన్నవాడు అయిన నిక్ జోనస్‌ను ప్రియాంక పెళ్లాడబోతోంది. దీంతో సల్మాన్‌ఖాన్ సినిమా ‘భరత్’ నుంచి తప్పుకుందనే వార్తలు వచ్చాయి. అయితే పెళ్లి కోసం కాదు… హాలీవుడ్‌లో వచ్చిన అవకాశాల కోసమే ప్రియాంక ‘భరత్’ నుంచి తప్పుకుందనే ప్రచారం జరుగుతోంది.

Comments

comments