Home తాజా వార్తలు 20 లక్షల వ్యూస్‌తో దూసుకపోతున్న ‘ప్రియతమా’ పాట

20 లక్షల వ్యూస్‌తో దూసుకపోతున్న ‘ప్రియతమా’ పాట

Majili first look

 

హైదరాబాద్: మజిలీ సినిమాలో నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్నారు. పెళ్లైన తరువాత తొలి సినిమాలో వీళ్లు నటించడంతో అభిమానులు ఈ మూవీపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మజిలీ చిత్రానికి సంబందించిన ఓ పాట యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రియతమా, ప్రియతమా అనే సాంగ్‌ను ఇప్పటివరకు 20 లక్షల మంది చూశారు. రెండో రోజుల క్రితమే విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ గా ఈ సాంగ్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ పాటను ఫేమస్ సింగర్ చిన్మయి శ్రీపాద పాడారు. మజిలీ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా షైన్ స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ సినిమా సమంతకు తోడుగా మరో హీరోయిన్ దివ్వాంశ కౌశిక్ నటిస్తుంది. ఏప్రిల్ 5న ఈ మూవీ విడుదల కానుంది. గురువారం సాయంత్రం ‘నా గుండెల్లో’ మూడో పాటను చిత్ర యూనిట్ విడుదల చేయనున్నట్టు సమంత తన ట్వీట్టర్ లో ట్వీట్ చేసింది.

Priyathama priyathama Lyrical Trending in Youtube

 

 

Courtesy By Aditya Music

 

 

Priyathama priyathama Lyrical Trend in Youtube