Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఐదు నుంచి కబడ్డీ సందడి..

Pro Kabaddi League 2018 to start from October 5

న్యూఢిల్లీ: ఐపిఎల్ తర్వాత అంతటి ఆదరణ కలిగిన ప్రో కబడ్డీ లీగ్‌కు అక్టోబర్ 5న తెరలేవనుంది. ప్రో కబడ్డీ ఆరో సీజన్ కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. 13 వారాల పాటు సుదీర్ఘంగా సాగే ఈ లీగ్‌లో మొత్తం 12 జట్లు తలపడుతున్నాయి. పోటీలకు సంబంధించి ప్రచార గీతాన్ని ఇప్పటికే విడుదల చేశారు. ఈ గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాగా, అక్టోబర్ ఐదున ప్రారంభమయ్యే కబడ్డీ లీగ్ వచ్చే ఏడాది జనవరి ఐదున జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. లీగ్‌లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. కాగా, ఈ సీజన్‌లో మొత్తం 138 మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తమిళ్ తలైవాన్ జట్లు తలపడుతాయి. భారత్‌లో క్రికెట్ తర్వాత అత్యంత ఆదరణ కలిగిన లీగ్‌గా ప్రో కబడ్డీ పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు సీజన్‌లు కూడా విజయవంతం అయ్యాయి. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో నిర్వాహకులు ఉన్నారు.

Comments

comments