Home తాజా వార్తలు 737 మ్యాక్స్ లోపాన్ని సరి చేశాం: బోయింగ్

737 మ్యాక్స్ లోపాన్ని సరి చేశాం: బోయింగ్

Problem in Boeing 737 MAX simulator software corrected

 

వాషింగ్టన్: వైమానిక రంగ దిగ్గజం బోయింగ్ సంస్థ శనివారం ఒక కీలక ప్రకటన చేసింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానంలోని సిమ్యులేటర్‌లో ఉన్న లోపాన్ని సరిచేసినట్లు తెలిపింది. ఈ రకం విమానం రెండు భారీ ప్రమాదాలకు కారణమై 346 మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే.‘ బోయింగ్ 737 మ్యాక్స్ సిమ్యులేటర్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యను సరిచేశాం. ఈ రకం విమానాలను నిర్వహిస్తున్న వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేశాం. వివిధ పరిస్థితుల్లో కూడా సక్రమంగా పని చేసేలా దీన్ని రూపొందించాం. ఈ మార్పుల్లో భాగంగా సిమ్యులేటర్ తయారీదారులతో కలిసి పని చేశాం. దీనిపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తాం’ అంటూ బోయింగ్ ఒక ప్రకటన విడుదల చేసింది.

Problem in Boeing 737 MAX simulator software corrected