Home రాష్ట్ర వార్తలు శని విరగడైనట్లే.. ఇక వేగం పెంచండి

శని విరగడైనట్లే.. ఇక వేగం పెంచండి

సుప్రీంకోర్టు తీర్పుపై సిఎం కెసిఆర్ సంతృప్తి
ప్రాజెక్టు పనుల వేగం పెంచాలని ఆదేశం
ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే పలువురు మంత్రులు, నేతలతో భేటీ
kcrహైదరాబాద్: పాలమూరు, డిండి ఎత్తిపోతల సాగు నీటి పథకాల విషయంలో సుప్రీంకోర్టు స్పందనపై తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన కొందరు రైతులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అపెక్స్ కౌన్సిల్‌లో రెండు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ సూచన ను సిఎం స్వాగతించారు. సుప్రీం కోర్టు స్పందన వల్ల పాలమూరు, డిండి ప్రాజెక్టుల పురోగతికి ఇకపై అడ్డంకులు ఉండకపోవచ్చని సిఎం అభిప్రా యప్డారు. పాలమూరు ప్రాజెక్టుకు పట్టిన శని విరగడవుతుందని, శాశ్వతం గా అడ్డంకులు తొలగినట్లేనని వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు దరిమిలా పాలమూరు, డిండి పనులు వేగం పుంజుకోనున్నాయి. ఆగమేఘాల మీద పనులు పూర్తిచేసి ప్రాజెక్టు ఫలితాలు ప్రజలకు అందిస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఎపి అభ్యంతరాలకు పెద్దగా విలువలేనందున ప్రాజెక్టుల ను శరవేగంగా నిర్మించాలని నీటిపారుదల శాఖను ముఖ్యమంత్రి ఆదే శించారు. అత్యంత కరువు పరిస్థితి ఉన్న మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల రైతులకు సాగునీరు అందించడం అత్యంత అవసరమని, పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రులు హరీష్ రావు, జూపల్లి కృష్ణా రావు, డాక్టర్ లకా్ష్మరెడ్డి,ఎంపిలు జితేందర్ రెడ్డి,గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆలం వెంకటేశ్వర రెడ్డి, జీవన్ రెడ్డి నీటిపారుదల ఈఎన్‌సి మురళీధర్ తదితరులతో సమావేశమయ్యారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు ముఖ్యమంత్రి, మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.
నీటి పారుదల ప్రాజక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిబంధనలమేరకు వ్యవహరిస్తున్నప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరచూ అర్ధంపర్ధం లేని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ భంగపడుతున్నదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తాజా స్పందనతోనైనా ఎపి ప్రభుత్వ వైఖరి మారాలని ఆకాంక్షించారు. సుప్రీం తీర్పు నల్లగొండ, పాలమూరు జిల్లాల ప్రజలకు గొప్ప ఊరట అని సిఎం అన్నారు. ఈ నేపద్యంలో రాకెట్ వేగంతో పాలమూరు,డిండి ప్రాజక్టులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖను ఆదేశించారు.