Search
Sunday 23 September 2018
  • :
  • :

వీసా కోసం యువకుడి ఇబ్బందులు

londoonరక్షిత్, స్వాతి జంటగా చిన్నికృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లండన్ బాబులు’. ఎవిఎన్ స్టూడియోస్ సమర్పణలో మారుతి టాకీస్ పతాకంపై మారుతి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. మారుతి, నిఖిల్, అనిల్ రావిపూడి, సుధీర్ వర్మ, చందుమొండేటి, ప్రసాద్, పరుశురామ్ కలిసి సంయుక్తంగా ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ “సినిమా ట్రైలర్ చాలా బాగుంది. స్వాతి ఈ సినిమా ఒప్పుకుందంటే అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. దర్శకుడు చిన్ని కృష్ణ సినిమాను అద్భుతంగా తెరకెక్కించా డు”అని అన్నారు. మారుతి మాట్లాడుతూ “వీసా కోసం ఓ యువకుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. అతని జీవితంలోకి ఓ అమ్మాయి ఎలా వచ్చిందనేదే ఈ సినిమా. స్వాతి కథను నమ్మి ఈ సినిమా చేసింది. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం”అని తెలిపారు. చిన్నికృష్ణ మాట్లాడుతూ “సినిమాలు లేవని ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పుడు మారుతి నుంచి ఈ సినిమా చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం విజయం సాధిస్తే నాలాంటి చాలా మందికి ఆయన అవకాశాలిస్తారు. ఈ చిత్రం ద్వారా రక్షిత్‌ను హీరోగా పరిచయం చేశాను. మంచి కామెడీ ఎంటర్‌టైనర్ ఇది”అని అన్నారు. స్వాతి మాట్లాడుతూ “ఈ సినిమా కోసం సిన్సియర్‌గా కష్టపడ్డాం. కొంతకాలం గ్యాప్ తర్వాత నేను నటించిన ఈ చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకుంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ అడ్డాల, జీవా, రాజా రవీంద్ర, రక్షిత్, అట్లూరి ప్రసాద్, కిరణ్, ఉద్ధవ్, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments