Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ధాన్యం కొనుగోలులో జాప్యంపై రోడ్డెక్కిన రైతులు

Problems with the purchase of grain

గన్నీ సంచులు లేక ఇక్కట్లు

మనతెలంగాణ/సారంగాపూర్: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యంను విక్రయించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నామని, వారం పది రోజుల నుంచి ధాన్యం కొనుగోలు జరగక ఇబ్బందు లు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ లక్ష్మీదేవిపల్లి రైతులు ఆదివారం రోడ్డెక్కారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లిలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చే యగా రైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందు కు అక్కడికి తరలించారు.అయితే కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసివారం పది రోజులు గడుస్తున్నాగన్నీ సంచులు లేకపోవడంతో పడిగాపులు పడుతున్నామని రైతులు తెలిపారు. రోజుకో చోట అకా ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఒకటి రెండు సార్లు ధాన్యం తడిసిపోయిందని,అయినా అధికారులు తమ బాధలను ప ట్టించుకోవడం లేదంటూ వారు ఆరోపించారు.జగిత్యాల – సారంగాపూర్ ప్రధాన రహదారిపైకి చేరుకున్న రైతులు రోడ్డుపై సుమారు గంట పాటు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దాంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకున్న సా రంగాపూర్ ఎస్‌ఐ రాజయ్య అక్కడికి చేరుకుని రైతులను సముదాయించేందుకు యత్నించగా అధికారులు వచ్చి హామీ ఇచ్చేంత వర కు కదలమంటూ భీష్మించుకు కూర్చున్నారు. దాంతో ఈ విషయా న్ని రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా విషయాన్ని తెలుపగా ఆదివారం సాయంత్రం వరకు గన్నీ సంచులు పంపిస్తామని, సాధ్యమైనంత తొందరగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.

Comments

comments