Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఆన్‌లైన్ పైరసీని అరికట్టండి

Suresh-Babuహైదరాబాద్ : ఆన్‌లైన్ పైరసీతో సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టం కలుగుతోందని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ పేర్కొన్నారు. ఆన్‌లైన్ పైరసీని అరికట్టే అంశంపై చర్చించేందుకు సినీ రంగ ప్రముఖులతో మంత్రి కెటిఆర్ బుధవారం ఓ సమావేశం నిర్వహించారు. సమావేశ అనంతరం సురేష్‌బాబు మాట్లాడారు. ఆన్‌లైన్ పైరసీ వల్ల తొమ్మిది నెలల కాలంలో సినీ పరిశ్రమకు రూ.350 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇంటర్నెట్‌లో సుమారు రెండు వందల సైట్లు ఆన్‌లైన్ పైరసీకి పాల్పడుతున్నాయని చెప్పారు. పైరసీని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కెటిఆర్‌ను కోరినట్టు సురేష్‌బాబు తెలిపారు.

Comments

comments