Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

లెక్కప్రకారమే వంటల్లో వేయొచ్చు..

bake

హైదరాబాద్: ప్రస్తుత యాంత్రిక యుగంలో వంట చేయడానికి కొన్ని కొలతలు తప్పనిసరి అవసరం. గ్రాముల్లో, ఔన్సుల్లో పదార్థాలను కొలిచి వంటలు చేసుకుంటున్నారు. దీంతో వాటిని తూచేందుకు ఇబ్బందిపడే వారు ఇక ఇప్పటి నుంచి ఫుడ్ స్కేల్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనిపై ఏదైనా వస్తువును గానీ.. పదార్థాన్ని గానీ.. ఉంచితే దాని బరువును కచ్చింతంగా గ్రాములతో సహా లెక్కించటం దీని ప్రత్యేకత.  ఇందులోని ఎల్‌ఇడి డిస్‌ప్లేలో పౌండ్లు, గ్రాములు, కెజిల వివరాలు తెలుస్తాయి. దీంతో మీకు ఎలాంటి  బాధ ఉండదు. ఉప్పు నుంచి  స్టార్ట్ చేస్తే చివర్లో వేసే మసాల దినుసుల వరకూ అన్ని లెక్కప్రకారమే వంటల్లో వేసుకోవచ్చు. దీంతో వంట పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. మళ్లీ కావాలంటే జీరో నుంచి లెక్కించుకోవచ్చు. దీనికి చార్జింగ్ పెట్టుకొనే సౌకర్యం కూడా ఉంది. ఇది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది ఐదు కెజిల వరకు బరువును తూచే సామర్థ్యం కలదు. మార్కెట్ లో దీని ధర రూ.1000 పైగా ఉండగా… ఆన్‌లైన్‌లో ఆఫర్లతో కలిపి రూ.700 లోపులోనే వినియోగదారులకు అందుబాటులో ఉంది.

Comments

comments